Latest Updates
-
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా!
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా..
మన జీవితాలను అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగు వైపు నడిపించే మార్గదర్శకులు ఉపాధ్యాయులు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం'(టీచర్స్ డే) ఎంతో ఘనంగా జరుపుకుంటాము. ఈ ప్రత్యేకమైన రోజున గురువుల పట్ల మనకున్న ప్రేమను, గౌరవాన్ని వ్యక్తపరచడానికి ఒక తీయని బహుమతి ఇస్తే ఎంత బాగుంటుంది?
ఈ టీచర్స్ డే నాడు మీ లైఫ్ లో టీచర్స్ కోసం ఒక అద్భుతమైన స్వీట్ పనీర్ పాయసం తయారు చేసి వారిని ఆశ్చర్యపరచండి. దీనిని మ ఇంట్లో తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

పనీర్ పాయసం తయారీకి కావలసిన పదార్థాలు
తురిమిన తాజా పనీర్ - 3/4 కప్పు
చక్కెర - అర కప్పు
పాలు - 3 కప్పులు
బాదం, పిస్తా - కొద్దిగా
యాలకుల పొడి - పావు టీస్పూన్
ఉప్పు - ఒక చిన్న చిటికెడు
నెయ్యి - 1 టీస్పూన్
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
పనీర్ పాయసం తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి అడుగు ఉన్న ఒక పాన్ పెట్టుకోండి. అందులో నెయ్యి వేసి మీడియం మంట మీద కరిగించండి.
-నెయ్యి వేడెక్కాక అందులో చక్కెర వేసి, మంటను మీడియంలో ఉంచి గరిటెతో కలుపుతూ ఉండండి. కొద్దిసేపటికి చక్కెర నెమ్మదిగా కరగడం ప్రారంభమై, లేత గోధుమ రంగులోకి మారుతుంది. చక్కెర పూర్తిగా కరిగి తేనె రంగులోకి వచ్చే వరకు కలపాలి. దీన్ని క్యారమెలైజేషన్ అంటారు. ఇది పాయసానికి అద్భుతమైన రుచిని ఇస్తుంది.
-ఇప్పుడు మంటను తగ్గించి, వేడి పాలను ఈ క్యారమెల్ మిశ్రమంలో చాలా జాగ్రత్తగా పోయాలి. పాలు పోయగానే క్యారమెల్ గట్టిపడినట్లు అనిపించినా, మరిగే కొద్దీ కరిగిపోతుంది.
-పాలు బాగా మరిగి నురుగు వచ్చే వరకు వేచి చూడండి. మధ్యమధ్యలో
కలుపుతూ ఉండాలి.
తరువాత సువాసన కోసం యాలకుల పొడి, స్వీట్ రుచిని బ్యాలెన్స్ చేయడానికి
ఒక చిన్న చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు
ఉడకనివ్వండి.
-ఇప్పుడు ముందుగా మెత్తగా తురిమి పెట్టుకున్న పనీర్ ను పాలలో వేయండి. గరిటెతో కలుపుతూ కేవలం 2 నుండి 3 నిమిషాల పాటు ఉడికించండి.
-ఈలోపు, మరో చిన్న కడాయిలో కొద్దిగా నెయ్యి వేడి చేసి అందులో బాదం, పిస్తా పప్పులను దోరగా వేయించండి. ఈ డ్రై ఫ్రూట్స్ ను పాయసంలో వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి.
-అంతే ఎంతో కమ్మగా ఉండే స్పెషల్ పనీర్ పాయసం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications