గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా..

Posted By:

శ్రీ కృష్ణ జన్మాష్టమి అనగానే భక్తకోటి హృదయాలు భక్తిపారవశ్యంతో ఉప్పొంగుతాయి. బాలకృష్ణుడి జన్మస్థలమైన మధుర, బృందావనం మొదలుకొని గుజరాత్‌ లోని చారిత్రక ద్వారక వరకు.. దేశవిదేశాల్లోని ఇస్కాన్ ఆలయాల వరకు ఎక్కడ చూసినా కృష్ణాష్టమి ఉత్సాహం అంబరాన్నంటుతుంది. కన్నయ్యను ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు రకరకాల పిండివంటలు, తీపి పదార్థాలు తయారు చేసినప్పటికీ, ఆయనకు నైవేద్యంగా సమర్పించే పంచామృతం విశిష్టత మాత్రం ఎంతో ప్రత్యేకమైనది.

పంచామృతం అంటే ఐదు అమృతప్రాయమైన, పవిత్రమైన పదార్థాల కలయిక. శ్రీకృష్ణునికి దీనిని నైవేద్యంగా పెట్టడమే కాకుండా, అర్ధరాత్రి స్వామివారి జనన సమయంలో ఈ పంచామృతంతోనే అత్యంత వైభవంగా అభిషేకం కూడా చేస్తారు. ఈ కృష్ణాష్టమికి స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన పంచామృతాన్ని సులభంగా, అత్యంత రుచికరంగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

Krishna Janmashtami Special How to Make the Perfect Divine Panchamrutham at Home in Telugu

పంచామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు

-ఆవు పెరుగు
-ఆవు పాలు
-చక్కెర పొడి
-యాలకల పొడి
-నెయ్యి
-తేనె
-నీరు
-డ్రై ఫ్రూట్స్
-తులసి ఆకులు

కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే..

పంచామృతం తయారీ విధానం

-ఒక గిన్నెలో తాజా పెరుగు తీసుకొని ఒక కవ్వం తీసుకుని పెరుగును ఉండలు లేకుండా మృదువుగా చిలకాలి. మీకు పంచామృతం కాస్త పలచగా కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు.

-పంచామృతంలో డ్రై ఫ్రూట్స్ వేస్తే ఆ రుచే వేరు! మీకు నచ్చిన బాదం, జీడిపప్పు లాంటివి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ముఖ్యంగా నేతిలో దోరగా వేయించిన మఖానా (తామర గింజలు), సారాపప్పు (చిరోంజి) వేస్తే పంచామృతం రుచి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి వీటిని తప్పకుండా సిద్ధం చేసుకోండి.

-ఇప్పుడు చిలికిన పెరుగులో తగినంత పంచదార పొడిని కలుపుకోవాలి. పెరుగుకు తగినంత తీపి సరిపోయేలా చూసుకుని బాగా మిక్స్ చేయాలి.

-తీపి పెరుగులో పాలు, స్వచ్ఛమైన నెయ్యి, కొద్దిగా తేనె, నీళ్లు వేసి కలపాలి. ఈ ఐదు అమృతాలు కలిసిన తర్వాత, ఇందులోనే ముందుగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన తులసి ఆకులను వేయడం మర్చిపోకండి. తులసి దళం లేనిదే స్వామివారి నైవేద్యం పూర్తికాదు.

-మంచి సువాసన కోసం చివరగా అర టీస్పూన్ యాలకుల పొడిని కలపాలి. ఇది పంచామృతానికి దైవికమైన పరిమళాన్ని, అదనపు రుచిని ఇస్తుంది. ఎవరికైనా ప్రసాదం పంచేటప్పుడు పైన కొన్ని వేయించిన మఖానాలు వేసి ఇస్తే ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

-రుచిని మరింత పెంచాలనుకుంటే, ఇందులో సన్నగా తరిగిన పండిన అరటిపండు ముక్కలను లేదా ఆపిల్ ముక్కలను కూడా కలుపుకోవచ్చు.

[ of 5 - Users]
Story first published: Friday, September 4, 2026, 10:38 [IST]
Desktop Bottom Promotion