ఉగాది రిసిపి: పైనాపిల్ బొబ్బట్లు...అథితులతో పాటు మీరు కూడా రెండు ఎక్కువే తింటారు!

Posted By:

Ugadi ఉగాది వేసివి సీజన్ తో ప్రారంభం అవుతుంది. ఉగాదిని హిందు క్యాలెండర్ ప్రకారం హిందువులకు నూతన సంవత్సరం. ఈ పండగకు ఓ స్పెషల్ ఉంది. రుచికరమైన వంటలను వండుకుని తింటారు. ముఖ్యంగా ఈ పండగకు ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలలో బొబట్లు లేదా పూలీ స్వీట్ రిసిపి తప్పనిసరిగా తయారుచేసుకుంటారు.

పూర్ణం పోలీ , బొబ్బట్లు అని పిలుచుకునే ఈ స్వీట్ రిసిపిని వివిధ రకాలుగా తయారుచేసుకుంటారు. అందులో ఒకటి పైనాపిల్ పోలి. మీరు పైనాపిల్ పోలి రుచి చూశారా? లేదంటే ఈ యుగాదికి పైనాపిల్ పోలీని ప్రయత్నించండి. ఇలా చేయడం కష్టమైన పని కాదు, సులభంగా చేయవచ్చు, దీన్ని ఎలా చేయాలో చూద్దాం:

కావాల్సిన పదార్థాలు

3/4 కప్పు కందిపప్పు
పైనాపిల్ 2 కప్పులు
బెల్ల పొడి: 1 కప్పు
చిటికెడు ఉప్పు
స్టార్ ఆనీ, జాజికాయ పొడి (1/2 స్పూన్)

ఇతర పదార్థాలు

మైదా 1కప్పు
చిరోటి రవ్వ ఒకటిన్నర కప్పు
పసుపు పొడి 1/2 tsp
నీళ్ళు
నూనె

తయారు చేసే విధానం

1. ముందుగా రవ్వ , మైదా మరియు పసుపు పొడి వేసి కొద్దిగా నీరు వేసి బాగా కలపాలి, చివరగా కొద్దిగా నూనె జోడించి మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ లో కడిగి పెట్టుకున్న కందిపప్పు ఉంచి బాగా ఉడికించాలి, ఆపై నీటిని వడకట్టి ప్రత్యేక పాత్రలో ఉంచండి. ఈ నీటితో రసం పెట్టుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది.
3. ఉడికిన పప్పును చల్లార్చి మిక్సిలో వేసి మెత్తగాపేస్ట్ చేసుకోవాలి. దానికి ముందుగా జార్ లో రెండు ఏలకలు, స్ట్రా ఆనీ, బెల్లంపొడి జోడించి పప్పును మెత్తగా రుబ్బుకోవాలి.
4. పప్పును మరీ నునుపుగా లేదా మరీ మెత్తగా కాకుండా పేస్ట్ చేసుకోవాలి. 5. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని దీనికి సన్నగా తరిగిన పైనాపిల్ పేస్ట్, వేసి వాగా మిక్స్ చేయాలి.
5. మొత్తం మిశ్రమం బాగా కలిసేలా మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.
6. దీనిని నిమ్మ పండు సైజులో పిండి తీసుకుని ఉండలు చేసుకోవాలి.
7. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని చపాతీ పిండికి సరిపోయేంత పిండి తీసుకుని, పూరీలా తట్టి అందులో పోలీ పూర్ణం పెట్టి వెడల్పుగా తట్టుకోవాలి.
8. తరవాత స్టౌ మీద పాన్‌ పెట్టి మీడియం మంట ఉంచాలి. పాన్ కు నూనె రాసి పాన్ బాగా వేడెక్కాక దానీ మీద పోలీ వేసి , దీన్ని రెండు వైపులా కాల్చుకోవాలి, పోలీ అంచులు, పోలీ మద నెయ్యి చిలరించడం వల్ల మాడిపోకుండా స్మూత్ గా కాలుతుంది. అంతే పైనాపిల్ పోలీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, April 4, 2024, 15:37 [IST]
Desktop Bottom Promotion