Latest Updates
-
ఈరోజు రాశి ఫలాలు (19.03.26): మేష రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
ఇడ్లీ,దోశల్లోకి అదిరిపోయే కొత్తిమీర-సాంబార్ ఉల్లిపాయ చట్నీ..ఇక పల్లీ చట్నీని మర్చిపోతారు! -
విటమిన్లు, మినరల్స్ పుష్కలం..హెల్దీ బ్రేక్ ఫాస్ట్ పచ్చి కూరగాయల దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఉగాది నాడు తప్పక చేయాల్సిన 5 పనులు..పచ్చడి తింటూ చదవాల్సిన శ్లోకం..ధర్మసింధు ఏం చెబుతోంది? -
ఉగాది 2026-27 రాశి ఫలాలు..పరాభవ నామ సంవత్సరంలో ఏ రాశికి రాజయోగం? ఏ రాశికి అవమానం? -
తక్కువ నూనె, ఎక్కువ రుచి.. నవరాత్రి స్పెషల్ సగ్గుబియ్యం దోశ..ఎలా చేసుకోవాలంటే -
నోరూరించే హైదరాబాదీ పనీర్ కీమా.. చపాతీ, రోటీ,పూరీల్లోకి దీన్ని మించిన రుచి లేదు! -
ఈరోజు రాశి ఫలాలు (18.03.26): మీన రాశిలో చంద్రుడి సంచారం.. ఈ రాశుల వారికి ధనలాభం! -
పిండి రుబ్బే పనిలేదు..అప్పటికప్పుడు ఐరన్, కాల్షియం నిండిన దూదిలాంటి మెత్తని రాగి ఇడ్లీ ..కొబ్బరి చట్నీతో కేక! -
పరాభవ నామ సంవత్సరానికి స్వాగతం..మీ ఫ్రెండ్స్, బంధువులకు బెస్ట్ ఉగాది విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇలా..
Pithikipappu Chicken Curry: పితికిపప్పు కూర దోసెలు, రాగిసంగటిలో వేసుకుని తింటే..భలేభలే
ఎంతో అత్రుతగా ఎదురుచూసే అనపకాయల సీజన్ వచ్చేసింది. మార్కెట్‌ను అనపకాయలతో ముంచెత్తుతుంది. అన్నమయ్య జిల్లాలోని పడమటి మండలాల్లో ఖరీఫ్ సీజన్‌లో వేరుశనగతో పాటు అనపకాయలు పండిస్తారు. నవంబర్ నుంచి జనవరి చివరి వరకు సీజన్ ఉంటుంది.
సంక్రాంతి వరకు ఘుమఘుమలే
అనపకాయలు కిలో రూ.30 వంతున విక్రయిస్తున్నారు. అనపకాయలు సంక్రాంతి
దాకా విరివిగా లభ్యమవుతాయి. దీంతో ఇళ్లల్లో వారానికి మూడు సార్లయినా
పితికిపప్పు రుచి చూడాల్సిందే. కేవలం వర్షాధారంగా చేళ్లల్లో పండిన
నాటు అనపకాయలు మాత్రమే చాలా రుచిగా ఉంటాయి. వీటిని ముట్టుకోగానే బంకగా
ఉండి, వాటి వాసన గంటసేపు ఉంటుంది.
అబ్బా దాని రుచే వేరు
అనపగింజలను గింజల కూర, చారు, సాంబారు చేస్తారు. అనపకాయలు ఒలిచి
గింజలను గిన్నెలో నీటిలో రాత్రి నానబెట్టి మరుసటి రోజు గింజలను పితికి
పప్పు కూరలు, చారుగా చేస్తారు. ఉదయమే దోసెల్లో పితికిపప్పు ఇష్టంగా
తింటారు. కొందరు పితికిపప్పును ఎండబెట్టి నూనెలో వేపుడు చేసి తింటారు.
అత్యంత రుచికరమైన ఆహార వంటలలో ఒకటి "పితికిపప్పు చికెన్ సాంబార్".
అనపకాయలతో చేసే పితికిపప్పు కూర దోసెలు, రాగిసంగటిలో వేసుకుని తింటే ఆ
రుచే వేరుగా ఉంటుంది. భోజనప్రియులు పితికిపప్పు కూరను ఎంతో ఇష్టంగా
తింటారు. ఒక్క సారి తిన్న వారికి మళ్లీ మళ్లీ వద్దు, ఇంత రుచికరమైన
పక్కా పల్లె స్టైల్ పితికిపప్పు చికెన్ కూర ఎలా చేయాలో, దానికి
కావాల్సిన పదార్థాలు ఏంటో వివరంగా కింద చూడండి:
కావలసిన పదార్థాలు
పితికిపప్పు 3/4 కిలోలు(అనపకాయల వలిచి, గింజలను నీళ్ళలో 2 లేదా 3 గంటలు నానబెట్టి, పొట్టును వేరుచేయడం)
చికెన్ 1 కిలో
పెద్ద ఉల్లిపాయ 2
టొమాటో 2
కొబ్బరి పొడి లేదా కొబ్బరి 1/4 కప్పు
కారం పొడి: 2 టేబుల్ స్పూన్
దనియా పొడి 2 టేబుల్ స్పూన్
ఉప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు
పసుపు పొడి 1/2 tsp
గరం మసాలా 1/4 tsp
గసగసాలు 1/4 tsp
రుచికి ఉప్పు
లవంగం, చెక్క, కొత్తిమీర
నూనె
తయారు చేసే విధానం* పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో లవంగాలు, చెక్క, యాలకలు, ఉల్లి, వెల్లుల్లి పాయలు వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
* స్టౌ మీద మరో పాన్ పెట్టి అందులో కొద్దిగా ఉల్లిపాయ, కొద్దిగా టమోటో ముక్కలు వేసి వేగించాలి. ఎర్రగా మారిన తర్వాత అందులో చికెన్ వేసి రెండు నిమిషాలు ఉడికించి,పితికి పప్పు వేసి పసుపు, ఉప్పు వేసి మీడియం మంట మీద బాగా ఉడికించాలి.
* పప్పులు మరియు చికెన్‌లో సగం మాత్రమే వండాలి ఎందుకంటే మిగిలినవి మసాలాలో వండుతారు.
* మిక్సీలో ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లి వెల్లుల్లి, చెక్కలవంగం మిశ్రం మరియు కొబ్బరి, ధనియాల పొడి, కారం పొడి, పసుపు, గరం మసాలా, గసగసాలు, టొమాటో,కొత్తిమీర వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
* మసాలా పచ్చిగా ఉన్నందున, బాణలిలో నూనె వేసి, మిగిలిన ఉల్లిపాయలు వేసి బాగా వేగిన తరువాత, రుబ్బిన మసాలా వేసి ఉడికించాలి.
* మసాలా తిప్పుతూ ఉండాలి, లేకపోతే బేస్ అంటుకుంటుంది.
* బాగా ఉడికిన మసాలా నూనె వదలడం ప్రారంభించినప్పుడు, ఒక పాత్రలో చికెన్ మరియు పితికిపప్పు మసాలా వేసి, నెమ్మదిగా కదిలించు, నీరు మరియు రుచికి ఉప్పు వేసి, నూనె స్టాక్ నుండి వచ్చే వరకు ఉడికించాలి.
సూచనలు
మీరు కొబ్బరిని ఎంత ఎక్కువ వేస్తే అంత పటిష్టమైన కూర, మీరు మిక్సీలో కొద్దిగా పితికిపప్పు కూడా జోడించవచ్చు. మసాలా చాలా స్పైసీగా ఉంటే గరం మసాలాను నివారించవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













