చుక్క నూనె లేకుండా..పోషకాలతో నిండిన బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఊరకనే అనలేదు. మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఉదయం పూట మనం తీసుకునే ఆహారం రోజంతా మనకు శక్తినిచ్చేలా ఉండాలి. ఉదయం పూట ఖరీదైన ఆహారాలు తినాల్సిన అవసరం లేదు. మన వంటింట్లో దొరికే పెసలతో ఎంతో తక్కువ ఖర్చుతో, ఎంతో విలువైన ఆరోగ్యాన్ని పొందవచ్చు.

పెసల పప్పు సలాడ్ ఉదయాన్నే చేసుకుని తింటే ఆరోగ్యానికి బోలెడు మేలు జరుగుతుంది. కేవలం బ్రేక్‌ ఫాస్ట్‌ గానే కాకుండా, సాయంత్రం స్నాక్ లాగా కూడా దీనిని తీసుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం, తక్కువ సమయంలోనే సిద్ధం చేసుకోవచ్చు. పెసల పప్పు సలాడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

Power Packed Breakfast Moong Dal Protein Salad With Zero Oil Recipe in Telugu

తయారీకి కావాల్సిన పదార్థాలు
-పెసలు
-పల్లీలు
-ఉప్పు
-ఉల్లిపాయ
-పచ్చిమిరపకాయ
-క్యారెట్
-టమాటో
-కొత్తిమీర
-వేయించిన జీలకర్ర పొడి
-మిరియాల పొడి
-నిమ్మరసం
-కీరదోసకాయ

తయారీ విధానం

-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ముప్పావు కప్పు పెసలు, అరకప్పు పల్లీలు వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఆ కడిగిన నీటిని వంపేసి అందులో మళ్లీ నీళ్లు పోసి రాత్రంతా (కనీసం 8 గంటలు)నానబెట్టుకోవాలి.

-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో రాత్రంతా నానబెట్టిన పెసలు,పల్లీలు వేసి ఇందులో పావు టీస్పూన్ ఉప్పు, అర కప్పు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేసి మీడియం మంట మీద 2 విజిల్స్ రానివ్వాలి.

-కుక్కర్ లో ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి ఒ గిన్నెలో వేసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి.

-చల్లారిన తర్వాత అందులో అర కప్పు ఉల్లిపాయ సన్నని తరుగు, 1 పచ్చిమిరపకాయ సన్నని తరుగు, 1 కప్పు కీరదోస ముక్కలు, 1 కప్పు క్యారెట్ తురుము, 1 టమాటో చిన్న ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి మొత్తం కలిసేలా కలుపుకోండి.

-బాగా కలుపుకున్నాక అందులో అర టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి, పావు టీస్పూన్ మిరియాల పొడి, కొద్దిగా నిమ్మరసం, కావాలనుకుంటే కొంచెం చాట్ మసాలా వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. అంతే సూపర్ టేస్టీ పెసరపప్పు సలాడ్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, January 29, 2026, 8:10 [IST]
Desktop Bottom Promotion