Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
Prawns fry: రొయ్యల వేపుడు..జన్మలో మర్చిపోలేని టేస్ట్..ఇలా చేయండి
రొయ్యల వేపుడు. ఈ పేరు వింటేనే కొంతమందికి నోట్లో లాలాజలం ఊరిపోతుంది. ఇక మందుబాబులు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీ ఫుడ్ ఇష్టపడేవాళ్లలో అందరి ఫేవరెట్ రొయ్యల వేపుడు(prawns fry). వీకెండ్స్ లో చాలామంది రెస్టారెంట్లకు వెళ్లి రొయ్యల వేపుడు ఆర్డర్ చేసుకొని ఆస్వాదిస్తుంటారు. అయితే ఇంట్లోనే లేదా బ్యాచిలర్స్ అయినా తమ రూమ్ లోనే చాలా ఈజీగా దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు. రెస్టారెంట్ కు మించిన టేస్ట్ ఇంట్లోనే వచ్చేలా రొయ్యల వేపుడు ఎలా చేసుకోవాలి, రొయ్యల వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూడండి.
రొయ్యల వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు
-1 కేజీ రొయ్యలు
-టమాటో
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-పసుపు
-ఉప్పు
-కారం
-జీలకర్ర పొడి
-ధనియాల పొడి
-గరం మసాలా
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-కరివేపాకు
-కొత్తిమీర
-పుదీనా
-లవంగం
-దాల్చినచెక్క
-బిర్యానీ ఆకు
-అనాస పువ్వు
-జాపత్రి
-ఆయిల్

రొయ్యల వేపుడు తయారీ విధానం
-ముందుగా 1 కేజీ రొయ్యలు తీసుకొని వాటి పైన పొట్టు మొత్తం ఒలిచేసేయాలి. దీంతో అది 400 గ్రాముల వరకు అవుతుంది.
-తర్వాత ఈ రొయ్యలను ఒక బౌల్ లో వేసి అందులోనే పసుపు, ఉప్పు,నిమ్మరసం వేసి శుభ్రంగా రొయ్యలను కడగాలి.
-ఇప్పుడు రొయ్యలలో పావు టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి,అర టీ స్పూన్ గరం మసాలా,అర టీస్పూన్ జీలకర్ర పొడి,పెద్దగా కట్ చేసిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు,పెద్దగా కట్ చేసిన 2 మీడియం సైజ్ టమాటోలు,పొడవుగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి,రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల అల్లంవెల్లుల్లి పేస్ట్, 2 రెమ్మల కరివేపాకు,సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొంచెం,కొద్దిగా పుదీనా వేసి మొత్తం రొయ్యలకు పట్టేలా చేత్తో లైట్ గా కలుపుకొని బౌల్ మీద మూతపెట్టేసి ఓ గంట పక్కన పెట్టుకోండి.
-1 గంట తర్వాత స్టవ్ ఆన్ పాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి వేడి చేయండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో 3 లవంగ మొగ్గలు,1 అనాస పువ్వు, 1 ఇంచు దాల్చిన చెక్క,1 బిర్యానీ ఆకు,కొద్దిగా జాపత్రి వేసి పేపండి.
- మసాలు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కలిపి ఉంచిన రొయ్యలను మొత్తం వేసేయండి. మంటను మీడియం ప్లేమ్ లో పెట్టి 3-4 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోండి.
-తర్వాత పాన్ మీద మూత పెట్టేయండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. రొయ్యలలోని వాటర్ ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై అవనివ్వండి.
-తర్వాత అందులో రెండు రెమ్మల కరివేపాకు వేసి మంటను సిమ్ లో పెట్టి రొయ్యలు కొద్దిగా డ్రైగా వచ్చేదాకా కలుపుతూ బాగా నిదానంగా వేయించుకోండి.
-తర్వాత దానిపై కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. టేస్టీ రొయ్యల వేపుడు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications