Latest Updates
-
ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టపడ్డారు..పెళ్లి చేసుకున్నారు..7 నెలలకే స్కూల్ టైతో భర్త గొంతు నులిమి.. -
మెంతులు ఆరోగ్యానికి మంచిదే కాదు... ఈ వ్యాధులు ఉన్నవారికి ముప్పూ తేవచ్చు! -
నానమ్మల కాలం నాటి నల్చిన కారం..చికెన్, మటన్ కూడా పోటికి రావు..రోలు, మిక్సీ కూడా అక్కర్లేదు చేత్తోనే.. -
బాబా వంగా అంచనా..అక్టోబర్ 5వ తేదీ నుంచి ఆ 5 రాశుల వారికి రాజయోగం పక్కా! -
తిండి ఆలస్యమైందని దండన.. జొమాటో డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వైరల్ వీడియో.! -
ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఉలవల కారం పొడి..ఒక్కసారి చేస్తే నెల రోజులు నిల్వ..ఇడ్లీ, వేడి అన్నంలోకి బెస్ట్ -
కోడిగుడ్లతో రొటీన్ కూరలు బోర్.. ఈ 'ఎగ్ బటర్ మసాలా' తప్పక ట్రై చేయండి! -
చంద్ర, కేతు సంయోగంతో సింహ రాశిలో గ్రహణం.. చిక్కుల్లో పడబోయే రాశులు ఇవే.! -
ఫ్రిజ్‌లో ఏ కూరగాయ ఎంత కాలం నిల్వ ఉంటుంది?.. సరైన స్టోరేజ్ పద్ధతులు ఇవే! -
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.!
నాటు శైలిలో ఘాటుగా 'రొయ్య పొట్టు చారు'.. పల్లెటూరి రుచుల మజానే వేరు.!
విలేజ్ సాంప్రదాయ వంటకాల్లో, తీరప్రాంత తెలుగు ఇళ్లలో ఘాటుగా నోరూరించే అత్యంత ప్రసిద్ధమైన వంటకం రొయ్య పొట్టు చారు. రొయ్య పొట్టుతో చారు చేసేటప్పుడు పులుపు, కారం సరిపడా వేసుకుంటే వేడివేడిగా అన్నంలోకి ఆ రుచే వేరుగా ఉంటుంది. జలుబుతో ముక్కులు మూసుకుపోయినప్పుడు, రానున్న చలికాలంలో నాలుకకి ఈ వంటకం మంచి మజాను ఇస్తుంది. పర్ఫెక్ట్ కొలతలతో ఎంతో టేస్టేగా రొయ్య పొట్టు చారు ఎలా తయారు చేయాలో చూద్దాం..

రొయ్య పొట్టు చారు తయారీకి కావాల్సిన పదార్థాలు
రొయ్య పొట్టు- 100 గ్రాములు
ఉల్లిపాయలు- మూడు(మీడియం సైజు)
పచ్చిమిర్చి- నాలుగు
కొత్తిమీర- గుప్పెడు
టమాటాలు- మూడు
చింతపండు- నిమ్మకాయ సైజు
అల్లం వెల్లుల్లి పేస్ట్- టీస్పూన్
నూనె- మూడు టేబుల్ స్పూన్లు
పసుపు- పావు టీస్పూన్
ఆవాలు- టీస్పూన్
కారం- రెండు టీస్పూన్లు
ధనియాల పొడి- టీస్పూన్
నీళ్లు- ముప్పావు లీటరు
రొయ్య పొట్టు చారు తయారీ విధానం
ముందుగా ఎండు రొయ్యలను చాటలో వేసుకుని దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా చెరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పైన బాణలి పెట్టుకుని వేడయ్యాక రొయ్యలు వేసి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. చింతపండును కడిగి నానబెట్టుకోవాలి.

ఇప్పుడు వేయించిన రొయ్యలను నీళ్లలో వేసి పది నిమిషాల పాటు వదిలేయాలి. ఉల్లిపాయలు, టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి రెండుగా కట్ చేసుకోవాలి.
స్టవ్‌పైన వెడల్పాటి బాణలి పెట్టుకుని అందులో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి. రంగు మారుతున్నప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించుకోవాలి.
తర్వాత టమాటాలు వేసి మెత్తగా మగ్గనివ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి కాసేపు ఉడికించాక నీళ్లలో నానబెట్టిన రొయ్యలను గట్టిగా పిండుకుని కూరలో వేసుకోవాలి.
కోడిగుడ్లతో రొటీన్ కూరలు బోర్.. ఈ 'ఎగ్ బటర్ మసాలా' తప్పక ట్రై చేయండి!
రొయ్యలు బాగా మగ్గిన తర్వాత కారం వేసి కలిపి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత చింతపండు రసం వేసి కలిపాక నీళ్లు పోసి మూత పెట్టి మరిగించుకోవాలి. మరిగేటప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి.
రొయ్య చారు కమ్మటి ఘుమఘుమల వాసన వస్తూ చిక్కగా అవుతున్నప్పుడు ఉప్పు సరిచూసుకుని కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.
పల్లెటూరి స్టైల్ రొయ్య పొట్టు చారు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
