Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
పంజాబీ స్పెషల్ రెసిపి..ఒక్కసారి తింటే వన్స్ మోర్ అని తీరాల్సిందే, ఎలా చేయాలంటే
రెగ్యలర్ గా అవే వంటలు తిని తిని బోర్ కొట్టేసిందా? కొత్తగా ఏదైనా తింటే బాగుంగు అనిపిస్తుందా? అయితే ఓసారి చోలే పన్నీర్ మసాలా గ్రేవీ ట్రై చేయండి. ఓక్కసారి తిన్నారంటే వన్స్ మోర్ అనాల్సిందే. చోలే పన్నీర్ మసాలా అనేది పంజాబీ వంటకం. ఇది రుచికరమైన, పోషకమైన వంటకం కూడా. ఇది రోటీ, నాన్, రైస్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్ని వయస్సుల వారికి నచ్చే వంటకం ఇది. చోలే పన్నీర్ మసాలాని ఇంట్లోనే చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు. చోలే పన్నీర్ మసాలా తయారుచేయడానికి కావాలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
చోలే పన్నీర్ మసాలా తయారుచేయడానికి కావలసిన పదార్థాలు
శనగలు: 1 కప్పు (రాత్రంతా నానబెట్టాలి)
పన్నీర్: 250 గ్రాములు (ముక్కలుగా కోయాలి)
ఉల్లిపాయలు: 2
టమోటాలు: 2
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి: 2
జీలకర్ర: 1 టీ స్పూన్
ధనియాల పొడి: 1 టీ స్పూన్
గరం మసాలా: 1/2 టీ స్పూన్
పసుపు: 1/4 టీ స్పూన్
కారం: 1/2 టీ స్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర: కొద్దిగా

చోలే పన్నీర్ మసాలా తయారీ విధానం
-ముందుగా శనగలను రాత్రంతా నానబెట్టాలి. శనగలను రాత్రంతా నానబెట్టడం వలన అవి త్వరగా ఉడుకుతాయి.
-నానబెట్టిన శనగలను కుక్కర్లో వేసి తగినంత నీరు, ఉప్పు వేసి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
-తర్వాత ఒక పాన్‌లో నూనె వేడి చేసి, జీలకర్ర వేసి వేయించాక ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిర్చి చీలికలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
-తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
-ఇప్పుడు టమోటా ముక్కలు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. మీ రుచికి అనుగుణంగా మసాలాల పరిమాణాన్ని మార్చుకోవచ్చు.
-ఉడికించిన శనగలు, పన్నీర్ ముక్కలు వేసి బాగా కలపాలి.
-తగినంత నీరు, ఉప్పు వేసి 5-10 నిమిషాలు ఉడికించాలి. ఈ కూరను మరింత రుచికరంగా చేయడానికి మీరు కొద్దిగా క్రీమ్ లేదా పెరుగును కూడా జోడించవచ్చు.
-కొత్తిమీరతో గార్నిష్ చేస్తే చోలే పన్నీర్ మసాలా రెడీ.
నార్త్ ఇండియా ఫేమస్ 'ఆలూ లచ్చా పరాఠా'..ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్
చోలే పన్నీర్ మసాలా ప్రయోజనాలు
చోలే పన్నీర్ మసాలాలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చోలేలో ఫైబర్, పొటాషియం ఉండటం వలన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది, ఇది బరువు నిర్వహణకు సహాయపడుతుంది. పన్నీర్లో కాల్షియం, విటమిన్ డి ఉండటం వలన ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. పన్నీర్లో జింక్, విటమిన్ ఏ ఉండటం వలన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తహీనతను నివారిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications