Latest Updates
-
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.!
అన్నం,రోటీ,చపాతీ ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్..ఫ్యూర్ వెజ్ బుర్జీ ఎలా చేసుకోవాలంటే
వెజ్ బుర్జీ.. గుడ్డు బుర్జీకి ఒక మంచి శాఖాహార ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇది రుచికరమైన, ఆరోగ్యకరమైన, తక్కువ సమయంలో తయారుచేయగల వంటకం. దీనిని చపాతీలు, రోటీలు, నాన్ లేదా వేడి అన్నంతో కలిపి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇది అల్పాహారానికి, తేలికపాటి భోజనానికి లేదా సాయంత్రం చిరుతిండికి సరైనది. సాంప్రదాయ గుడ్డు బుర్జీకి శాకాహార ప్రత్యామ్నాయంగా, ఈ వంటకం పోషకాలు, రుచిలో ఏ మాత్రం తీసిపోదు. ఇది చూడటానికి,తినడానికి అంతా కోడిగుడ్డుతో చేసినట్లే ఉంటుంది. ప్యూర్ వెజ్ బుర్జీని తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
వెజ్ బుర్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-శెనగపిండి
-బియ్యంపిండి
-వంటసోడా
-ఉప్పు
-కొత్తిమీర
-కరివేపాకు
-కారం
-ధనియాల పొడి
-గరం మసాలా
-అల్లం తరుగు
-పసుపు
-ఉల్లిపాయ తరుగు
-జీలకర్ర
-టమాటో
-పచ్చిమిర్చి
-నిమ్మరసం

వెజ్ బుర్జీ తయారీ విధానం
-ముందుగా ఓ పెద్ద గిన్నె తీసుకొని అందులో పావుకప్పు బియ్యం పిండి, 1కప్పు శెనగపిండి,అరటీస్పూన్ వంటసోడా,రుచికి సరిపడా ఉప్పు వేసి చేత్తో మొత్తం కలిసేలా బాగా కలపండి. తర్వాత ఇందులోనే తగినన్ని నీళ్లు పోసి దోశ పండి కంటే కాస్త జారుగా ఉంచుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి అర టీస్పూన్ జీలకర్ర వేసి చిట్లనిచ్చాక 1కప్పు సన్నని ఉల్లిపాయ తరుగు, 2 రెబ్బల కరివేపాకు, అర టీస్పూన్ అల్లం తరుగు వేసి 2-3 నిమిషాల పాటు వేయించాక 2 చీరిన పచ్చిమిర్చి,రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ పసుపు వేసి వేయించాలి.
-ఉల్లిపాయలు పింక్ కలర్ లోకి మారుతున్నప్పుడు 2 టమాటోల సన్నని ముక్కలు వేసి మరో 2 నిమిషాలు వేయించాక 1 టీస్పూన్ కారం, 1 టీస్పూన్ ధనియాల పొడి, పావు టీస్పూన్ గరం మసాలా,పావు టీస్పూన్ మిరియాల పొడి వేసి వేయించాలి.
-టమాటోలు కొద్దిగా మెత్తబడిన తర్వాత అందులో కలిపి ఉంచిన శెనగపిండి మిశ్రమాన్ని పాన్ అంతా దిబ్బరొట్టెలా పోసేయండి. అంచుల వెంట 1 టేబుల్ స్పూన్ ఆయిల్,పైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మూతపెట్టేసి మీడియం మంట శెనగపిండిని నిదానంగా ఉడకనివ్వండి.
-4 నిమిషాల తర్వాత గరిటలో పిండిలో అక్కడక్కడా రంధ్రాల్లా చేసుకోండి. దీనివల్ల పిండి లోపలిదాకా బాగా ఉడుకుతుంది.
-పావు గంట తర్వాత శెనగపిండిమీద పగుళ్లు వచ్చినప్పుడు దాన్ని గరిటతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
-మంటను పెంచి నెమ్మదిగా కలుపుతూ శెనగపిండిలోని చెమ్మ ఆరిపోయి పొడి పొడిగా అయ్యేదాకా కలుపుకోవాలి. ఎక్కువగా గరిటపెట్టి కలుపుతూ ఉండకూడదని గుర్తుంచుకోండి. పదే పదే గరిట పెట్టి కలపడం వల్ల రవ్వ రవ్వగా అయిపోతుంది.
-పెద్ద మంట మీద 6-7 నిమిషాలు వేయించాక శెనగపిండిలోని నీరు ఇగిరిపోయి క్రిస్పీగా మారుతుంది. పిండి పిండిగా అనిపిస్తే మరికొద్దిసేపు వేయించుకోండి.
-స్టవ్ ఆఫ్ చేసే 1 నిమిషం ముందు కొంచెం సన్నని పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా కొత్తిమీర, 1 చెక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకోండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
