Latest Updates
-
మగాళ్లలో వంధ్యత్వానికి కారణం అండర్ వేర్ ఏనా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజం! -
దీపావళికి స్పెషల్ స్వీట్.. కేవలం వేరుశెనగలతో నోట్లో వెన్నలా కరిగిపోయే పీనట్ హల్వా చేసుకోండిలా.. -
జీర్ణక్రియను మెరుగుపరిచే.. ఇడ్లీ, దోశలోకి అదిరిపోయే కొబ్బరి అల్లం చట్నీ చేసుకోండిలా.. -
Dhanteras 2026: ధనత్రయోదశి రోజు ఏ ముహూర్తంలో బంగారం కొనాలి? పూజా విధానం పూర్తి వివరాలు -
ఈ దీపావళికి ఇడ్లీలతో స్పైసీ బోటి పులుసు.. ఇలా చేస్తే రుచి అద్భుతం -
2027లో బంగారం ధర ఎంత ఉంటదో తెలుసా? బాబా వంగా సంచలన జోస్యం! -
ముంబై ఫేమస్ బాంబే ఐస్ హల్వా.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి -
జామ ఆకుల టీని రోజుకు ఒక్క కప్పు తాగితే చాలు.. ఈ 4 భయంకరమైన ఆరోగ్య సమస్యలు మాయం! -
అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్.. సొరకాయ కోఫ్తా కర్రీ ఇలా చేశారంటే కేక టేస్ట్! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి జామ్..మీ ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా..
తింటే స్వర్గమే అనిపించేంత రుచి..కేవలం 10 నిమిషాల్లో చేసుకునే టమాటో రైస్..ఇలా చేసుకోండి
నేటి ఉరుకులు పరుగుల జీవితంలో వంట చేయడానికి ఎక్కువ సమయం కేటాయించడం చాలా మందికి కష్టంగా మారింది. ముఖ్యంగా ఉదయం పూట ఆఫీసులకు వెళ్లేవారికి, పాఠశాలలకు వెళ్లే పిల్లలకు లంచ్ బాక్స్ సిద్ధం చేయడం ఒక పెద్ద సవాలు. ఇలాంటి సమయాల్లో తక్కువ సమయంలో, సులభంగా, రుచిగా,ఆరోగ్యకరంగా చేసుకోగలిగే వంటకాల వైపు మొగ్గు చూపుతారు. అలాంటి వంటకాల్లో టమాటో రైస్ ముందు వరుసలో ఉంటుంది.
అప్పటికప్పుడు వండిన అన్నంతో అయినా లేదా రాత్రి మిగిలిన అన్నంతో కేవలం 10 నిమిషాల్లో వేడివేడిగా, ఎంతో రుచిగా ఉండే టమాటో రైస్‌ను తయారు చేసుకోవచ్చు. టమాటో రైస్ కేవలం రుచికరమైన భోజనం మాత్రమే కాదు, ఇది పోషకాల గని కూడా. ఇందులో ప్రధాన పాత్ర పోషించే టమాటాలలో మన శరీరానికి అవసరమైన అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.

టమాటో రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-వండిన అన్నం
-టమాటాలు
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-నూనె లేదా నెయ్యి
-పసుపు
-కారం
-గరం మసాలా
-ధనియాల పొడి
-కరివేపాకు
-కొత్తిమీర
-ఉప్పు
టమాటో రైస్ తయారీ విధానం
-టమాటో రైస్ చేయడానికి ముందుగా 3 టమాటోలను మిక్సీ జార్ లో మెత్తని ప్యూరీలా చేసుకొని పక్కన ఉంచుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చెయ్యాలి.
-ఆయిల్ వేడయ్యాక అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయ చీలికలు వేసి మీడియం మంట మీద ఉల్లిపాయలను బాగా వేగనివ్వాలి.
-ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో అర టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. తర్వాత ఇందులో టమాటో ప్యూరీ వేయండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ కారం, 1 టీస్పూన్ గరం మసాలా, 1 టీస్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, కొద్దిగా కరివేపాకు వేసి మీడియం మంట మీద టమాటోలోని నీరు అంతా ఇగిరిపోయి, ఆయిల్ అంతా సైడ్స్ కి వచ్చే వరకు హై ప్లేమ్ లో కలుపుకోవాలి.
-ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు అందులో సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా కొద్దిగా వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులో 2 కప్పుల ఉడికించిన అన్నం వేసి మీడియం మంట మద మొత్తం అన్నంకి బాగా కలిసేలా కలుపుకోండి.
-అంతే టమాటో రైస్ రెడీ. వేడి వేడిగా దీన్ని తింటే స్వర్గమే. లంచ్ బాక్సులోకి కూడా బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
