Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ కుర్మా.. పూరీ,రాగి సంగటితో తింటే కిర్రాక్..ఎలా చేసుకోవాలంటే
చికెన్ కుర్మా అనేది ఒక సుగంధభరితమైన, రుచికరమైన వంటకం. ఇది ఎక్కువగా పెరుగు, వివిధ రకాల మసాలాలను ఉపయోగించి తయారుచేస్తారు. ఇది సాధారణంగా అన్నం, నాన్, పరాటా, పూరీ లేదా చపాతీ, రాగి సంగటితో కలిపి తింటే అదిరిపోతుంది. చికెన్ కుర్మా రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిలో ఉన్న పదార్థాలు పోషకాలను అందిస్తాయి. రెస్టారెంట్ స్టైల్ చికెన్ కుర్మాని ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
చికెన్ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు
-కారం
-పసుపు
-ఉప్పు
-చికెన్
-పెరుగు
-కసూరి మేథీ
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-ధనియాల పొడి
-జీలకర్ర పొడి
-మిరియాల పొడి
-ఉల్లిపాయ
-ఆయిల్
-బటర్
-మిరియాలు
-జాపత్రి
-జాజికాయ
-రాతిపువ్వు
-బిర్యానీ ఆకు
-పచ్చిమిరపకాయ
-గరం మసాలా
-దాల్చిన చెక్క
-లవంగ మొగ్గలు
-యాలకలు
-అనాస పువ్వు
-షాజీరా

చికెన్ కుర్మా తయారీ విధానం
-ముందుగా ఓ బౌల్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగిన అరకేజీ చికెన్ ను వేయండి. ఇందులోనే అర టీస్పూన్ జీలకర్ర పొడి, అర టీస్పూన్ మిరియాల పొడి, అర టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ ఉప్పు, 2 టీస్పూన్ల ధనియాల పొడి, 1 టీస్పూన్ కారం, 2 టీస్పూన్ల కశ్మీరీ రెడ్ చిల్లీ కారం, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 100గ్రాముల పెరుగు, 1 టేబుల్ కసూరి మేథీని బాగా నలిపి వేసి ఇవి మెత్తం కలిసేలా బాగా చేత్తో కలుపుకోవాలి.
-బాగా కలుపుకున్నతర్వాత బౌల్ మీద మూత పెట్టేసి అరగంట సేపు పక్కన ఉంచాలి.
-తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. కట్ చేసిన ఉల్లిపాయలను స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేడి చేసి అందులో వేసి మీడియం మంట మీద వేయించాలి. బాగా ఎర్రగా వేగిన ఉల్లిపాయలను బాండీలో నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి.
-వేయించిన ఉల్లిపాయలు చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్ లో వేసి మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చెయ్యాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసుకోవచ్చు.
-బటర్ పూర్తిగా కరిగిన తర్వాత అందులో 1 బిర్యానీ ఆకు, పావు టీస్పూన్ మిరియాలు, పావు టీస్పూన్ షాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, కొద్దిగా జాపత్రి, 2 యాలకలు, లవంగ మొగ్గలు, 1 అనాస పువ్వు, కొద్దిగా రాతి పువ్వు వేసి వీటన్నింటినీ లైట్ గా వేయించాలి.
-తర్వాత అందులో ముందుగా కలిపి పక్కన ఉంచిన చికెన్ మిశ్రమం మొత్తాన్ని వేసి మీడియం మంట మీద చికెన్ లో నుంచి ఊరే నీళ్లన్నీ ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కలుపుతూ వేయించుకోవాలి.
-ఆయిల్ సపరేట్ అయ్యే సమయంలో అందులో గాట్లు పెట్టిన 3 పచ్చి మిరపకాయలు, మిక్సీలో వేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ మిశ్రమం కూడా వేసి తక్కువ మంట మీద 2 నిమిషాలు వేయించుకోవాలి.
-తర్వాత అందులో ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోయండి. అందులోనే అర టీస్పూన్ గరం మసాలా పొడి కూడా వేసి మొత్తం బాగా కలుపుకోండి. మూతపెట్టి తక్కువ మంట మీద చిక్కటి గ్రేవీగా మారేదాకా ఉడికించాలి. కాస్త పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేయండి. అంతే టేస్టీ చికెన్ కుర్మా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications