Latest Updates
-
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు! -
బాస్మతి రైస్‌తో ఎప్పుడూ బిర్యానీయేనా.. స్పాంజీగా, అలా నోట్లే వేస్తే కరిగిపోయేలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.! -
అక్టోబర్‌లో ప్రధాన గ్రహాల రాశి మార్పు.. మేషం నుంచి మీనం వరకు జాతకం ఎలా ఉంటుందంటే.! -
Strongest Currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏదో తెలుసా? -
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.!
ఈ చిట్కాలు తెలిస్తే..కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్ గా పొంగుతూ, మృదువుగా,రుచిగా వస్తాయి
పైన కరకరలాడుతూ, లోపల కొబ్బరి, బెల్లం కలయికతో మెత్తగా కరిగిపోయే కొబ్బరి బూరెలు చూస్తుంటేనే ఎవరికైనా నోరు ఊరిపోవాల్సిందే. మన తెలుగు లోగిళ్లలో పండుగ అనగానే గుర్తొచ్చే సాంప్రదాయక వంటకాల్లో బూరెలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానమే ఉంటుంది.
పండుగలకైనా, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడైనా లేదా కమ్మని స్వీట్ తినాలనిపించినప్పుడైనా చేసుకోదగ్గ అద్భుతమైన వంటకం ఇది. బూరెలు పర్ఫెక్ట్ గా, గుల్లగా, రుచిగా రావడానికి చిన్న చిన్న చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. పర్ఫెక్ట్ కొబ్బరి బూరెలు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బియ్యం - 1 కేజీ
బెల్లం - 750 గ్రాములు
యాలకుల పొడి - 1 టేబుల్ స్పూన్
పచ్చి కొబ్బరి తురుము - 1 చిప్ప
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం
రెండే పదార్థాలతో చేసుకోండిలా..
తయారీ విధానం
-ముందుగా రాత్రిపూట బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ బియ్యాన్ని మరోసారి కడిగి, నీళ్లన్నీ పూర్తిగా వంపేయాలి.
-నీరు పూర్తిగా పోయాక బియ్యాన్ని మెత్తని పిండిలా (మిక్సీలో లేదా గిర్నీలో) పట్టించుకోవాలి. ఆ తర్వాత పిండిని జల్లెడ పట్టుకోవాలి. పిండి కాస్త తడిగా ఉండాలి. జల్లించిన తడి బియ్యప్పిండి ఆరిపోకుండా చేత్తో గట్టిగా అదిమిపెట్టి, పైన మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో బెల్లం వేసి, అర కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. కరిగిన బెల్లం నీటిని దళసరిగా ఉండే పెద్ద గిన్నెలోకి వడకట్టుకోవాలి..నలకలు ఏమైనా ఉంటే పోతాయి. ఈ బెల్లం నీటిని లేత పాకం వచ్చే వరకు ఉడికించాలి. బూరెలు సాఫ్ట్ గా రావాలంటే పాకం సరైన పదునులో ఉండటం చాలా ముఖ్యం.
-పాకం సరైన పదునుకు రాగానే, అందులో పచ్చి కొబ్బరి తురుము వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి యాలకుల పొడి వేయాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న తడి బియ్యప్పిండిని కొద్దికొద్దిగా పోస్తూ, ఉండలు కట్టకుండా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవచ్చు, లేదా అప్పటికప్పుడైనా బూరెలు వేసుకోవచ్చు.
-చేతికి కొద్దిగా నూనె రాసుకుని, పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని మీకు ఇష్టమైన సైజులో బూరెల్లా ఒత్తుకోవాలి. స్టవ్ మీద కడాయిలో నూనె వేడి చేసి, ఒత్తి పెట్టుకున్న బూరెలను వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, వేడివేడి కొబ్బరి బూరెలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
