Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మన పూర్వీకులు తిన్నది ఇదే..చుక్క ఆయిల్ అక్కర్లేదు,బరువు కూడా తగ్గొచ్చు..ఎలా చేసుకోవాలంటే
రాగి పిండితో అనేక రకాల వంటకాలు తయారుచేస్తుంటారు. సాధారణంగా మనోళ్లు రాగి ఉప్మా, రాగి సంగటి, రాగి జావ వంటివి ఎక్కువగా తయారుచేస్తుంటారు. అయితే మీరెప్పుడైనా రాగి ధలియా తిన్నారా?సామ బియ్యం, రాగి పిండితో కలిపి తయారుచేసే ఈ వంటకం చాలా రుచికరంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా అనేక రకాలుగా ఇది మేలు చేస్తుంది. బీపీ, షుగర్ ఉన్నోళ్లకు ఇది మంచి ఫుడ్. అలాగే బరువు తగ్గాలనుకునేవాళ్లకి కూడా ఇది బెస్ట్ ఫుడ్. రాగి ధలియాను ఇంట్లోనే తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
రాగి ధలియా తయారీకి కావలసిన పదార్థాలు
-రాగి పిండి
-సామ బియ్యం
-పొడి కందులు
-జీలకర్ర
-ధనియాలు
-పచ్చిమిర్చి
-తోటకూర
-ఉప్పు
-కరివేపాకు
-వెల్లుల్లి
-పల్లీలు
-నీరు
-నిమ్మరసం
-నెయ్యి

-ముందుగా 3 స్పూన్ల సామ బియ్యం నానబెట్టుకోవాలి.
-తర్వాత ఓ కప్పులో 3 టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసి జారుగా ఉండేలా ఇందులో నీళ్లు పోసి కలిపి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ లేదా పాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి లో ఫ్లేమ్ మీద వేయించి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో 3 టేబుల్ స్పూన్ల పొడి కందులు వేసి లో ప్లేమ్ మీద వేయించి అందులోనే 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ ధనియాలు, 1 రెబ్బ కరివేపాకు వేసి, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి 2 నిమిషాలు వేయించుకొని మొత్తం చల్లారక వీటిని మిక్సీలో వేసి ముందు వేయించిన పల్లీలు కూడా వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కనపెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో 300 ml నీళ్లు పోసి మరిగించాక అందులో అర చెంచా జీలకర్ర, 2 గంటలు నానబెట్టిన 3 చెంచాల సామ బియ్యం, 1 పచ్చిమిర్చి తరుగు, 1 కట్ట తోటకూర తరుగు వేసి కలిపి మూతపెట్టి 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి.
-తర్వాత మూత తీసి అందులో రాగిపిండి మిశ్రమాన్ని పోసి బాగా కలిపి 3 నిమిషాలు ఉడకనివ్వాలి. కాస్త దగ్గరపడ్డాక అందులో మిక్సీలో వేసి చేసుకున్న పొడి వేస మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మూతపెట్టి లో ప్లేమ్ మీద 3-4 నిమిషాలు అది మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి.
-తర్వాత మూతతీసి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అరచెక్క నిమ్మరసం పిండి కలుపుకొని దించేసుకోవాలి. అంతే రాగి ధలియా రెడీ
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications