Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.!
డైట్లో భాగంగా ఈ రోజుల్లో రాగి పిండి మన వంటకాల్లో తప్పనిసరి అయింది. అందుకే రాగి పిండితో జావ, లేదంటే దోశ, ఇడ్లీ లాంటి స్పెషల్స్ చాలా చేస్తుంటాం. ఇక బన్ దోశలు కూడా మన కిచెన్‌లో చాలా ఫేమస్. దీనికి కొంచెం రాగి పిండి యాడ్ చేశారంటే.. రుచికి రుచితో పాటు ఉక్కు లాంటి కండరాలు మీ సొంతమవుతాయి. డయాబెటిస్, బీపీ బాధితులకు కూడా ఇది మంచి డైట్ సలహా.. రాగి బన్ దోశను ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..

రాగి బన్ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
రాగి పిండి- అరకప్పు
బొంబాయి రవ్వ- అర కప్పు
పుల్లటి పెరుగు- అర కప్పు
నీళ్లు- అర కప్పు
నూనె- రెండున్నర టేబుల్ స్పూన్లు
శనగపప్పు- రెండు టీస్పూన్లు
జీడిపప్పులు- పది
ఆవాలు- టీ స్పూన్
జీలకర్ర- టీ స్పూన్
ఉల్లిపాయలు- ఒకటి
పచ్చిమిర్చి- రెండు
కరివేపాకు- రెండు రెబ్బలు
క్యారెట్ తురుము- కప్పు
కొత్తిమీర- గుప్పెడు
ఉప్పు- టీస్పూన్
ఇంగువ- పావు టీస్పూన్
బియ్యం పిండి- రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు- టీస్పూన్
వంటసోడా- పావు టీస్పూన్
రాగి బన్ దోశ తయారీ విధానం
రాగి బన్ దోశ కోసం ముందుగా వెడల్పాటి బౌల్ తీసుకుని అందులో రాగి పిండి, బొంబాయి రవ్వ, పుల్లటి పెరుగు వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి.
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.!
ఈ పిండిని ఒకసారి మిక్సీ బౌల్లో వేసుకుని దోశ పిండి మాదిరిగా రుబ్బుకోవాలి. పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

తర్వాత స్టవ్‌పైన పాన్ పెట్టుకుని అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసి కాగిన తర్వాత శనగపప్పు, జీడిపప్పులు వేసి వేయించుకోవాలి.
ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి. చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. అందులోనే క్యారెట్ తురుము, కొత్తిమీర, ఉప్పు, ఇంగువ వేసి మరోసారి కలిపి వేయించుకోవాలి.
ఈ మిశ్రమం మొత్తాన్ని రాగి పిండిలో కలుపుకోవాలి. చివరిగా బియ్యం పిండి వేసి మరోసారి కలిపి పెట్టుకోవాలి.
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.!
ఇప్పుడు స్టవ్‌పైన బన్ దోశలు వేసుకునే చిన్న బాణలి పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేయాలి.
నూనె కాగిన తర్వాత దోశ పిండిని మందంగా వేసుకుని కాల్చుకోవాలి. రెండో వైపు కూడా ఇలాగే కాల్చుకోవాలి.
ఇలా మిగతా పిండిని కూడా చేసుకోవాలి. అంతే రుచికరమైన టేస్టీ రాగి బన్ దోశలు రెడీ. బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయినా డిన్నర్‌లోకి అయినా డైట్ ఫుడ్‌గా తీసుకుంటే హెల్త్‌కి మేలు చేస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
