Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Ragi Java: రాగి జావ ఇలా చేసుకొని తాగితే..మన పూర్వీకుల ఎముకల బలం మీ సొంతం
మన పూర్వీకులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించడానికి ప్రధాన కారణం వారి ఆహార అలవాట్లు. ఆరోగ్యకరమైన తిండి తిన్నారు కాబట్టే ఎలాంటి షుగర్,బీపీ,గుండె జబ్బులు,క్యాన్సర్ వంటి రోగాలు లేకుండా హాయిగా జీవించారు. మన పూర్వీకులు తమ ఆహారంలో భాగంగా ప్రతి రోజూ ఉదయాన్నే ఓ గ్లాస్ రాగి జావ తాగేవాళ్లు. అందుకే వాళ్ల ఎముకలు బలంగా,దృఢంగా ఉండేవి. ఇప్పుడు చాలామంది మన పూర్వీకుల ఈ ఫుడ్ స్టైల్ ని షాలో అవుతున్నారు.
ఉదయాన్నే రాగిజావ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. రాగిజావ ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన పోషకాహారాలను కలిగి ఉంటుంది. ఫైబర్,విటమిన్స్,మినరల్స్,కార్బోహైడ్రేట్‌లు,కొవ్వులు, ప్రొటీన్‌ల వంటి అన్ని అవసరమైన స్థూలపోషకాలను కలిగి ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

ఒకప్పుడు పెద్దగా ఎలాంటి ఖర్చు చేయకుండా ఈజీగా దొరికే రాగిజావను ఇప్పుడు సిటీల్లో ఓ గ్లాస్ నే 100 రూపాయల వరకు అమ్ముతున్నారు. అయితే అంత ఖర్చు పెట్టకుండా రాగి జావను ఇంట్లోనే చాలా సులభం చేసుకొని మన పూర్వీకుల్లా ఆరోగ్యంగా ఉండవచ్చు. రాగి జావ ఎలా చేసుకోవాలి,దీని తయారీకి ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాం.
రాగి జావ తయారీకి కావాల్సినవి
నీరు-2 లేదా 3 గ్లాసులు
రాగి పిండి- 4 టేబుల్ స్పూన్స్
ఉప్పు-రుచికి తగినంత
జీలకర్ర పొడి - 1/2 టేబుల్ స్పూన్
మజ్జిగ లేదా పెరుగు-1 కప్పు
రాగి జావ తయారీ విధానం
-ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో రాగి పిండి వేయండి.
-ఇప్పుడు అందులో నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలపండి.
-ఇప్పుడు ఒక పెద్ద గిన్నె పొయ్యి మీద పెట్టి అందులో రెండు గ్లాసుల
నీళ్లు పోయండి.
-నీళ్లు మరిగిన తర్వాత కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని
పొయ్యి మీద మరిగిన నీళ్లల్లో పోయాలి.
-ఇప్పుడు మంట చిన్నగా పెట్టి గరిటెతో జావ ఉండలు కట్టకుండా తిప్పుతూ
ఉండండి.
-రెండు మూడు నిమిషాలు సన్నని మంటపై జావ ఉడికిన తర్వాత అందులో తగినంత
ఉప్పు,జీలకర్ర పొడి వేసుకోవాలి.
-జావ కొద్దిగా చల్లారిన తర్వాత అందులోకి పెరుగు లేదా మజ్జిగ వేసుకుని
కలిపి తాగితే చాలా బాగుంటుంది.
-జావ మరింత రుచికరంగా ఉండటానికి అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి
ముక్కలు, కొత్తిమీర కూడా కలుపుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications