Latest Updates
-
మేషరాశిలో బుధాస్తమయం: ఈ 26 రోజులు డిజిటల్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి! -
ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనయోగం.. పట్టిందల్లా బంగారం కాబోతోంది..! -
పుచ్చకాయ తింటూ ఈ 3 తప్పులు చేస్తే మీ ప్రాణాలకే ముప్పు! -
నారద జయంతి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
నోట్లో నీళ్లు ఊరించే టమాటా నిల్వ పచ్చడి.. నెలల పాటు నిల్వ ఉండేలా చేసుకోండిలా.. -
వృషభం, సింహం, మకర రాశుల వారికి శని దేవుని ఆశీస్సులు.. మీ రాశి ఉందా? - శనివారం, 02 మే 2026 -
ఎండలు మండిపోతున్నాయా? పీరియడ్స్ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మే 2026 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రిసెప్షన్: తారల సందడితో హోరెత్తుతున్న వేదిక.. ఫోటోలు వైరల్! -
వైశాఖ పౌర్ణమి వేళ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు!
రాగి వెజిటబుల్ దోస రెసిపీ ఉదయం అల్పాహారంకైనా..రాత్రి డిన్నర్ కైనా ఆరోగ్యకరమైనది..బరువుతగ్గించేది
రాగి వెజిటబుల్ దోస వంటకం చాలా సింపుల్. ఈ రాగి దోస పులియబెట్టనవసరం లేకుండా త్వరగా అల్పాహారం చేసుకోవచ్చు. ఇది రాగి పిండి, గోధుమ పిండి, రవ్వ, కూరగాయలు, జీలకర్ర మరియు ఉప్పుతో తయారు చేయబడిన నానబెట్టని, రాగి దోస వంటకం. ఫింగర్ మిల్లెట్ లేదా రాగి రెసిపీ అల్పాహారం లేదా తేలికపాటి రాత్రి భోజనం కోసం చాలా ఆరోగ్యకరమైనది.
మిల్లెట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. దీనికి కొన్ని తాజా కూరగాయలు మసాలా దినుసులు జోడిస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. క్యారెట్, బీన్సే కాకుండా మీకు నచ్చిన కూరగాయలతో ఈ వంటను తయారుచేసుకోవచ్చు. మనం రకరకాల దోసెలను తయారుచేసుకుంటాము. ఇందులో ఈ రోజు రాగి దోస వంకాన్ని ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
రాగి వెజిటబుల్ దోస రిసిపి
తయారీ సమయం: 10 నిమిషాలు
వంట సమయం: 10 నిమిషాలు
కావలసినపదార్థాలు:
1 కప్పు రాగి పిండి
2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి
మీడియం రవ్వ 2 టేబుల్ స్పూన్లు
1 అంగుళం పొడవు అల్లం
1 టేబుల్ స్పూన్ కరివేపాకు
2 టేబుల్ స్పూన్లు మెంతి ఆకులు
2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర ఆకులు
1 మీడియం సైజ్ ఉల్లిపాయ
1/2 క్యాప్సికమ్
1/2 క్యారెట్
1/2 స్పూన్ జీలకర్ర గింజలు
మీ రుచికి సరిపడా ఉప్పు
రాగి వెజిటబుల్ దోస తయారుచేయు విధానం:
- రాగి పిండి, గోధుమ పిండి మరియు రవ్వ తీసుకోండి. అన్నీ ఒకదానిలో వేసి బాగా మిక్స్ చేయండి.
- అందులో తరిగిన అల్లం, కరివేపాకు, మెంతి ఆకులు మరియు కొత్తిమీర జోడించండి. రాగి వెజిటబుల్ క్విక్ దోస రెసిపీ కోసం మీకు నచ్చిన ఏదైనా ఆకులను మీరు జోడించవచ్చు
- అందులోనే ఉల్లిపాయ, క్యాప్సికమ్ మరియు తురిమిన క్యారెట్ వంటి తరిగిన కూరగాయలను జోడించండి.
- 2 కప్పుల నీరు వేసి, ముద్ద లేకుండా పిండిని తయారు చేయండి.
- అందులోనే జీలకర్ర విత్తనాలను జోడించండి
- మీ రుచికి తగినట్లుగా ఉప్పు వేయండి.
- ఒక పాన్ వేడి చేయండి, సన్నని దోసెలు చేయడానికి పిండిని పోయాలి. దానిపైన నూనె రాయాలి
- మూత మూసి కొన్ని సెకన్ల పాటు ఉడికించాలి.
- మూత తెరవండి. పైన నెయ్యి లేదా నూనె వేయండి. మీడియం మంట మీద కాసేపు ఉడికించాలి.
- దోసెను మడిచి బయటకు తీయాలి. కొబ్బరి చట్నీ లేదా చట్నీ పౌడర్‌తో వేడిగా సర్వ్ చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













