అన్నం, రోటీల్లోకి బెస్ట్‌ ఎవర్‌ సైడ్‌ డిష్‌.. రాజస్థానీ ఫేమస్‌ పంచరత్న దాల్‌.!

వారంలో మూడు సార్లయినా డైనింగ్‌ టైబుల్‌పైన పప్పు వంటకం లేని ఇల్లు ఉండదు. ఎన్ని రకాల వెరైటీలు ఉన్నా చివర్లో పప్పు లేదా సాంబార్‌తో తింటే వచ్చే తృప్తి వేరు. అప్పుడు కానీ కడుపు నిండిన అనుభూతి ఉండదు. అయితే పప్పు అంటే మనకి కందిపప్పు, పెసరపప్పు మాత్రమే గుర్తొస్తుంది. కానీ రాజస్థానీ స్టైల్‌లో చేసే ఈ పంచరత్న దాల్‌ మీరు తిని చూశారంటే మాత్రం ఇంకోసారి టేస్ట్‌ చేయకుండా ఉండలేరు. ఐదు రకాల పప్పులతో చేసే ఈ అమృతతుల్యమైన వంటకాన్ని పోషకాహారంలో భాగంగా తప్పనిసరిగా చేసుకోవాల్సిందే.

Rajasthani style panchratna dal recipe for best side dish for roti and rice

పంచరత్న దాల్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు

కందిపప్పు- పావు కప్పు
పెసర్లు- పావు కప్పు
ఎర్ర కందిపప్పు- పావు కప్పు
నల్ల మినుములు- పావు కప్పు
పెసర పప్పు- పావు కప్పు
పసుపు- పావు టీస్పూన్‌
ఉప్పు- టీస్పూన్‌
నూనె- రెండు టీస్పూన్లు
నెయ్యి- ఒక టేబుల్‌ స్పూన్‌
ఆవాలు- టీస్పూన్‌
జీలకర్ర- టీస్పూన్‌
ఎండు మిర్చి- రెండు
తరిగిన వెల్లుల్లి- రెండు టీ స్పూన్లు
తరిగిన అల్లం- టీస్పూన్‌
పచ్చిమిర్చి- రెండు
ఉల్లిపాయలు- రెండు
టమాటా- రెండు
కారం- రెండు టీస్పూన్లు
ధనియాల పొడి- టీస్పూన్‌
గరం మసాలా- టీస్పూన్‌
కసూరి మెంతి- కొద్దిగా
కొత్తిమీర- కొద్దిగా

రాజస్థానీ ఫేమస్‌ పంచరత్న దాల్‌ తయారీ విధానం

ముందుగా ఒక బౌల్‌లోకి కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పెసర్లు, పెసరపప్పు, నల్ల మినుములు తీసుకుని వేడి నీళ్లు పోసి గంటపాటు నానబెట్టుకోవాలి. గంట తర్వాత పప్పుల్లోని నీటిని తీసివేసి ఒకసారి కడిగి కుక్కర్‌లో వేసి నీళ్లు పోసి ఉప్పు, పసుపు, టీస్పూన్ నూనె వేసి ఐదు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించుకోవాలి.

ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.!

ఐదు విజిల్స్‌ తర్వాత కుక్కర్‌ మూత తీసి గరిటెతో కలుపుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌పైన వెడల్పాటి మందపాటి పాన్‌ పెట్టుకుని అందులో టీస్పూన్‌ నూనె, నెయ్యి వేసి కాగనివ్వాలి. ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేగనివ్వాలి.

Rajasthani style panchratna dal recipe for best side dish for roti and rice

తర్వాత చిన్నగా కట్‌ చేసిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి తరుగు వేసి కలుపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఉల్లిపాయలు వేసి దోరగా వేగనివ్వాలి. ఇప్పుడు చిన్నగా కట్‌ చేసిన టమాటాలు వేసి మెత్తగా మగ్గనివ్వాలి.

రెస్టారెంట్‌ స్టైల్‌ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.!

ఉడికిన తర్వాత కారం, ధనియాల పొడి వేసి కాసేపు ఉడికించుకుని కారం బాగా పట్టిన తర్వాత ఉడికించిన పంచ ధాన్యాల పప్పు వేసుకుని కలపాలి. ధనియాల పొడి, కసూరి మెంతి వేసి కలపాలి.

ఐదు నిమిషాల పాటు చిన్న మంటపైన మూత పెట్టి ఉడకనివ్వాలి. చివర్లో కొత్తిమీరతో గార్నిష్‌ చేసి స్టవ్‌ ఆఫ్‌ చేసి దించుకోవడమే. పోషకాలు పుష్కలంగా ఉండే పంచరత్న దాల్‌ రెసిపీ రెడీ. అన్నం, రోటీల్లోకి ఈ వంటకం అద్భుతంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Friday, September 25, 2026, 12:49 [IST]
Desktop Bottom Promotion