Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
రాయలసీమ ఎగ్ కారం దోశ..జిందగీలో మర్చిపోలేని టేస్ట్,రోజూ ఇదే కావాలంటారు..ఎలా చేసుకోవాలంటే
దక్షిణ భారతదేశంలో దోశ ఒక ప్రముఖ బ్రేక్ ఫాస్ట్. ఇది రుచికి, పోషక విలువలకు ప్రసిద్ధి చెందింది. దోశలో అనేక రకాలున్నాయి వాటిలో ఎగ్ కారం దోశ ఒక ప్రత్యేకమైన వంటకం. ఇది దోశ పిండికి గుడ్డు, కారం పొడి, ఇతర మసాలాలు కలిపి తయారుచేయబడుతుంది. ఎగ్ కారం దోశ రుచిగా ఉండటమే కాకుండా పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి. రాయలసీమ స్టైల్ లో ఎగ్ కారం దోశ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
ఎగ్ కారం దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
-మినపప్పు
-దోశల బియ్యం
-అటుకులు
-మెంతులు
-ఉప్పు
-వెల్లుల్లి రెబ్బలు
-ఎండుమిర్చి
-చింతపండు
-ఆయిల్
-కోడిగుడ్డు

ఎగ్ కారం దోశ తయారీ విధానం
-ముందుగా 1 కప్పు మినపప్పు, 2.5 కప్పుల దోశల బియ్యం, అరకప్పు అటుకులు, 1 టీస్పూన్ మెంతులను కడిగి విడిగా కనీసం నాలుగు గంటలు నానబెట్టుకోవాలి.
-తర్వాత వీటన్నింటిని మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని కనీసం 12 గంటలు పులియబెట్టాలి.
-తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసి కలిపి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో 100 గ్రాముల ఎండుమిర్చి వేసి ఇందులోనే నిమ్మపండు సైజు అంత చింతపండు, 15 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా కల్లు ఉప్పు,కొంచెం నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
టేస్టీ సొరకాయ హల్వా..ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..ఎలా చేసుకోవాలంటే
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి 75ml ఆయిల్ పోసి వేడి చేసి అందులో అర టీస్పూన్ ఆవాలు, రెండు రెబ్బల కరివేపాకు, మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఎర్ర కారం వేసి చట్నీని నూనె పైకి తేలేంతవరకు కలుపుతూ వేయించాలి.
-తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేసి మంట తగ్గించి దానిమీద పెద్ద గరిటతో పిండిని తీసుకొని దోశను పోయండి.
-దోశమీద ,దోశ అంచుల వెంట 2.5 టీస్పూన్ల ఆయిల్ పోసుకోండి. తర్వాత అట్టు మధ్యలో కొంచెం కారం చట్నీ, తర్వాత ఎగ్ కొట్టి వేసి దానిని బాగా పరిచి రెండు వైపులా బాగా కాల్చాలి. అంతే ఎగ్ కారం దోశ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications