Nune vankaya: రాయలసీమ స్పెషల్ 'నూనె వంకాయ'..ఇలా చేస్తే ఏళ్లు గడిచినా నోట్లో దాని టేస్ట్

Posted By:

రాయలసీమ వంటకాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేసే ఉంటుంది. రాయలసీమలో చేసే నాటు కోడి పులుసు రాగి సంగటి దగ్గర నుంచి నూనె వంకాయ వరకు రాయలసీమ వంటకాలు అంటే పడి చచ్చిపోతారు ఫుడ్ లవర్స్. కొంతమంది అయితే రాయలసీమ ఫుడ్స్ దొరికే హోటల్స్ ఎక్కడున్నాయి అని వెతుక్కొని మరీ వెళ్తారు.. మరికొందరు రాయలసీయ స్టైల్ రెసిపీలను ఇంట్లోనే చేసుకుంటారు. రాయలసీమలో ఉండే రోజూ ఈ రుచులను ఆస్వాదిస్తుంటారు అది వేరే విషయం.

రాయలసీమలో చాలా ఫేమస్ రెసిపీ ఒకటుంది. అదే నూనె వంకాయ కూర(Nune vankay).ఒక్కసారి తిన్నారంటే కొన్నేళ్ల వరకు ఆ టేస్ట్ నోట్లో ఉంటుంది మరి. రాయలసీమ స్పెషల్ నూనె వంకాయ కూర చేసుకోడానికి ఏయే పదార్థాలు కావాలి,తయారీ విధానం ఎలా అనేది కింద చూడండి.

నూనె వంకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు
-గుత్తి వంకాయలు
-పచ్చిమిర్చి
-జీలకర్ర
-ఆయిల్
-పచ్చి శనగపప్పు
-టమాటో
-ఉప్పు
-ఉల్లిపాయ
-పసుపు
-పచ్చి కొబ్బరి
-ఆవాలు
-మిరియాలు
-కరివేపాకు
-టమాటో
-కొత్తిమీర
-కారం

నూనె వంకాయ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడి చేసుకోండి.

-నూనె వేడెక్కాక అందులో ఓ టీ స్పూన్ జీలకర్ర,1 పచ్చిమిర్చి చీలికలు,ఓ పెద్ద సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి కలపండి.

-ఒక నిమిషం తర్వాత ఇందులో కొంచెం ఉప్పు,రెండు టీ స్పూన్ల పచ్చి శెనగపప్పు కూడా వేసి వేగనివ్వాలి.

-ఉల్లిపాయలు మెత్తబడి,శనపప్పు ఎర్రగా వేగిన తర్వాత ఇందులో రెండు టమాటోను పెద్ద ముక్కలుగా కోసి వేసుకోవాలి.

-ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని టామాటోలను జస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే చాలు.

-టమాటో ముక్కలు పచ్చివాసన పోయి 50 శాతం మగ్గిన తర్వాత పొయ్యి మీద నుంచి తీసి ఈ మొత్తం మిశ్రమంతో పాటు పావు కప్పు పచ్చి కొబ్బరి కూడా కలిపి మిక్సీలో వేసి తగినంత నీళ్లు పోసుకుంటూ మొత్తగా పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు టామాటోలు వేపిన బాండీలోనే నాలుగు టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడి చేసుకోండి. ఇందులోనే ఓ టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడించండి.

-ఆ తర్వాత అందులో ఓ టీ ప్పూన్ మిరియాలు,ఓ టీ స్పూన్ జీలకర్ర,ఓ రెబ్బ కరివేపాకు,ఓ మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు,12-15 వెల్లుల్లి వేసి ఉల్లిపాయలను ఎర్రగా వేపుకోవాలి.

-ఇప్పుడు మధ్యకు నాలుగు భాగాలుగా చీరిన 10-12 గుత్తి వంకాయలను అందులో వేసుకోండి. ఇందులో కాస్త రుచికి సరిపడా ఉప్పు వేసి వంకాయలు మెత్తగా అయ్యేవరకు వేపుకోండి.

-వంకాయలు మెత్తబడ్డాక అందులో రెండు టీ స్పూన్ల కారం,2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని మీడియం మంట మీద వేయించుకోండి.

-వంకాయలు కారంలో వేగిన తర్వాత అందులో నిమ్మకాయ సైజు అంత చింతపండు నుంచి తీసిన రసాన్ని అందులో పోయండి.

-చింతపండు పులుసు ఓ పొంగు వచ్చిన తర్వాత ముందుగా మెత్తగా మిక్సీ వేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ ని ఇందులో వేసి బాగా కలుపుకోండి. టమాటో పేస్ట్ మరీ చిక్కగా అనిపిస్తే కాస్త నీళ్లు పోసుకోండి.

-ఇప్పుడు పాన్ మీద మూత పెట్టి మంట సన్నని సెగ మీద నూనె పైకి తేలే వరకు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి దాని మీద సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోంటే టేస్టీ నూనె వంకాయ కూర రెడీ.

[ of 5 - Users]
Story first published: Friday, November 29, 2024, 18:20 [IST]
Desktop Bottom Promotion