Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
Pulagam: రాయలసీమ స్పెషల్ 'పులగం' విత్ పల్లీ చట్నీ..యమా టేస్టీ.ఎట్ల చేయాలంటే..
రాయలసీయలో చాలామంది ఉదయాన్నే ఇళ్లల్లో ఇడ్లీ,దోశకు బదులుగా 'పులగం(pulagam)' చేస్తుంటారు. పల్లీ పచ్చడి కాంబినేషన్ తో పులగం తింటే టేస్ట్ పిచ్చెక్కిస్తది. కొంతమంది అయితే రోజూ దీన్నే చేయించుకు తింటుంటారు. రాయలసీయ స్పెషల్ పులగం రెసిపీని మీరు ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే టేస్టీగా ఉండేలా రాయలసీమ స్పెషల్ వంటకం పులగం విత్ పల్లీ పచ్చడి తయారీకి కావాల్సిన, తయారీ విధానం ఇక్కడ చూడండి.
పులగం,పల్లీ చట్నీ తయారీకి కావాల్సిప
పదార్థాలు
-పొట్టు పెసలు
-టమాటో
-పచ్చిమిర్చి
-చింతపండు
-ఆవాలు
-జీలకర్ర
-ధనియాలు
-ఎండుమిర్చి
-పసుపు
-ఉప్పు
-మిరియాలు
-ఉల్లిపాయ
-పల్లీలు
-కరివేపాకు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-వెల్లుల్లి
-ఆయిల్

పులగం,పల్లీ చట్నీ తయారీ విధానం
-ముందుగా ఓ బౌల్ లో ఓ కప్పు పొట్టు పెసలు,కొంచెం నీళ్లు పోసి గంటసేపు నానబెట్టుకోండి.
-ఓ కప్పు బియ్యం కూడా గంట సేపు నానబెట్టుకోండి.
-నిమ్మకాయంత చింతపండు కూడా నానబెట్టండి.
-తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిమీద ఓ కుక్కర్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్,1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మిరియాలు వేసి కొద్దిగా వేగిన తర్వాత అందులోనే 1 ఉల్లిపాయ చీలికలు, 5 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు,రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఉల్లిపాయలు మెత్తబడేవరకు వేపుకోండి.
-ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోండి. కొంచెం వేగిన తర్వాత ఇందులోనే పెద్దగా కట్ చేసిన ఓ టమాటో ముక్కలను వేయండి. టమాటోపైనే స్కిన్ వేరుపడే వరకు వేపండి.
-ఇప్పుడు మగ్గిన టమాటోల్లో నానబెట్టిన పొట్టు పెసలు,నానబెట్టిన బియ్యం వేసి 2 నిమిషాలు కలుపుతూ వేపండి.
-బియ్యంలోని చెమ్మ ఆరిపోయిన తర్వాత అందులో 3 కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేసి మంటను హై ప్లేమ్ మీద పెట్టండి.
-ఒక విజిల్ వచ్చిన తర్వాత మంటను మీడియం ప్లేమ్ మీద పెట్టి మరో 2 రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఆవిరి అంతా పోనివ్వాలి. పులగం రెడీ.
-ఇప్పుడు పల్లీ చట్నీ తయారీ కోసం స్టవ్ ఆన్ చేసి ఓ బాండీపెట్టి అందులో 1 కప్పు పల్లీలు వేసి లో ప్లేమ్ మీద బాగా వేపండి.
-పల్లీలు వేగిన తర్వాత వాటిని ఓ ప్లేట్ లోకి తీసుకొని మొత్తం పొట్టు తీసి పెట్టుకోండి.
-ఇప్పుడు అదే బాండీలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత అందులో 13 ఎండుమిర్చి వేసి బాగా వేగిన తర్వాత వాటిని మిక్సీ గిన్నెలో వేసి,అందులోనే పొట్టు తీసి ఉంచిన పల్లీలు,నానబెట్టిన నిమ్మకాయంత చింతపండు,తగినన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేయండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న నూనెలోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీస్పూన్ జీలకర్ర,కట్ చేసిన 1 టమాటో ముక్కలు వేసి 2-3 నిమిషాలు వేపండి. మగ్గుతున్న టమాటోల్లో కొంచెం పసుపు,కొంచెం ఉప్పు వేసి కలిపిన తర్వాత దీన్నంతా ఓ ప్లేట్ లోకి తోడుకొనిఈ మొత్తాన్ని గ్రైండ్ చేసి ఉంచిన పల్లీల మిశ్రమంలో వేసి,ఇందులోనే ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కాస్త పలుకుగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి. పల్లీ చెట్నీ రెడీ.
-ఇందులోనే ఓ పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకుంటే ఇంకా టేస్టీగా ఉంటంది. వేడి వేడి పులగంలో ఈ చట్నీ వేసుకొని తింటే మైమరచిపోవాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications