Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
Gongura Endu Mirchi Fry: గోంగూర ఎండుమిర్చి ఫ్రై.. ఇలా చేసుకొని తింటే ఆహా అనాల్సిందే!
తెలుగు ప్రజలకు గోంగూర అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎంత ఇస్తామంటే పలు సినిమాల్లో గోంగూర మీద పాటలు కూడా పాడించేంత. అలాంటి గోంగూరలో మన తెలుగు రాష్ట్రాల్లో అనేక వంటలు చేస్తుంటారు. గోంగూర పచ్చడి నుంచి గోంగూర బిర్యాని వరకు అన్ని విధాలా వంటకాలను తెలుగు వాళ్లు ఇష్టంగా తింటారు. అందులో అందరికీ ఇష్టమైనది గోంగూర వేపుడు. దీనిని సాధారణంగా పచ్చి మిర్చితో చేస్తుంటారు.
అయితే ఎండు మిర్చితో చేసే గోంగూర ఫ్రై కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ ఎండుమిర్చి, గోంగూర వేపుడును ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనే విషయాల గురించి ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.
గోంగూర ఎండుమిర్చి ఫ్రైకి కావాల్సిన పదార్థాలు
- గోంగూర
- ఎండుమిర్చి
- కారం
- తాలింపు గింజలు
- కరివేపాకు
- ఫ్రైకి సరిపడా నూనె
- రుచికి సరిపడా ఉప్పు
- కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి
- చిటికెడు పసుపు
- ఒక స్పూన్ గరం మసాలా
గోంగూర ఎండుమిర్చి ఫ్రై చేసుకునే విధానం
ముందుగా గోంగూరను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపై ఒక కడాయిని పెట్టుకోవాలి. అందులో గోంగూర ఫ్రై అయ్యేందుకు సరిపడా పోసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో కొంచెం తాలింపు గింజలు, కరివేపాకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే పది ఎండు మిర్చిని తుంపుకొని వేసుకోవాలి.
ఎండుమిర్చి, తాలింపు ఫ్రై అయ్యాక అందులో ముందుగా కడిగిపెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం కలిపేసి ఒక అయిదు నిమిషాల పాటు ఉడనివ్వాలి. ఈ క్రమంలో గోంగూర కడాయికి అంటకుండా ఉండేందుకు అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. కొద్దీ సేపటికి గోంగూర ఉడికిన తరువాత, అందులో దంచుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి.
అలాగే చిటికెడు పసుపు, కారం కొంచెం సమానంగా ఉండేందుకు ఒక స్పూన్ కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ మిశ్రమం మొత్తాన్ని కలుపుకొని ఓ రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆ తరువాత ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. అనంతరం ఆ గోంగూరను కిందకు దించుకుంటే ఎండుమిర్చి, గోంగూర ఫ్రై సిద్ధమైనట్లే. దీనిని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి వేరే లెవెల్‌లో ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












