Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
వంట చేసే ఓపిక లేనప్పుడు ఇది బెస్ట్..5 నిమిషాల్లోనే రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్..ఎలా చేసుకోవాలంటే
జీరా రైస్ లేదా జీరా పులావ్..ఇండియన్ రెస్టారెంట్లలో తరచుగా కనిపించే సులభమైన, సువాసనభరితమైన వంటకం. వంట చేసే ఓపిక లేనప్పుడు దీనిని తయారుచేసుకోవడం బెస్ట్. ఇది సాధారణంగా పప్పు, కూరలు లేదా ఇతర మసాలా వంటకాలతో కలిపి వడ్డిస్తారు. జీరా రైస్ కేవలం రుచికరమైనదే కాదు, జీలకర్రలో ఉండే ఔషధ గుణాల వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జీరా రైస్ తయారీకి పెద్దగా సమయం కూడా పట్టదు. కేవలం 5 నిమిషాల్లోనే జీరా రైస్ రెడీ చేసుకోవచ్చు. వంటగదిలో రెగ్యులర్ గా ఉండే పదార్థాలతోనే దీనిని తయారుచేసుకోవచ్చు. బ్యాచిలర్లు కూడా చాలా సింపుల్ గా కేవలం 5 నిమిషాల్లోనే రెస్టారెంట్ స్టైల్ లో జీరా రైస్ ను ఇంట్లో తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
జీరా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు
ఎండుమిరపకాయలు
పచ్చిమిరపకాయలు
ఆయిల్
జీలకర్ర
ఉప్పు
కొత్తిమీర తరుగు

జీరా రైస్ తయారీ విధానం
ముందుగ స్టవ్ మీద పాన్ పెట్టి 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి
చేసుకోండి.
వేడెక్కిన ఆయిల్ 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి 3 ఎండుమిరపకాయ ముక్కలు, 3 పచ్చిమిరపకాయల ముక్కలు వేసి మంచి సువాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చివర్లో 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి.
తర్వాత మంట తగ్గించి అందులో ఉడికించిన బాస్మతి రైస్ లేదా సోనా మసూరి రైస్ వేసి బాగా కలపండి.
ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, 1 కట్ట కొత్తిమీర తరుగు వేసి బాగా కలపండి. అంతే జీరా రైస్ రెడీ.
కొన్ని ప్రయోజనాలు
జీలకర్ర జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది, తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో ఇది ప్రసిద్ధి చెందింది. జీలకర్ర జీవక్రియను వేగవంతం చేస్తుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి, ఇది బరువు తగ్గడానికి లేదా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం, జీలకర్ర రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, ఇది మధుమేహం ఉన్నవారికి లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
జీలకర్ర శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది, ఇది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. జీలకర్రలో ఉండే సమ్మేళనాలకు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. జీరా రైస్ ఆరోగ్యకరమైనది అయినప్పటికీ, దానిని మితంగా తీసుకోవడం ముఖ్యం. బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పరిమితుల్లో తీసుకోవాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
