Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
నాలుగే గుడ్లతో 20 నిమిషాల్లో..ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ మంచూరియన్
సాయంత్రం వేళ వేడివేడిగా, కారంకారంగా ఏదైనా తినాలని మనసు లాగుతుందా? పిల్లలు స్కూల్ నుంచి రాగానే అమ్మా, ఏదైనా స్పెషల్ స్నాక్ చెయ్యి అని అడుగుతున్నారా? రోజూ చేసే బజ్జీలు, పకోడీలు కాకుండా ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకుంటున్నారా?
ఇంట్లో కేవలం నాలుగు గుడ్లు ఉంటే చాలు..అచ్చం రెస్టారెంట్ లో తిన్న అనుభూతినిచ్చే ఎగ్ మంచూరియన్ ను మీరే సులభంగా తయారు చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు
గుడ్లు - 4
మిరియాల పొడి - పావు టీస్పూన్
ఉప్పు - చిటికెడు
మైదా పిండి - అర కప్పు
మొక్కజొన్న పిండి - పావు కప్పు
కారం - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రై చేయడానికి
నూనె - 2 టేబుల్ స్పూన్లు
అల్లం - 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 2 లేదా 3
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
సోయా సాస్ - 1 టేబుల్ స్పూన్
టొమాటో కెచప్ - 2 టేబుల్ స్పూన్లు
రెడ్ చిల్లీ సాస్ - 2 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి - పావు టీస్పూన్
స్ప్రింగ్ ఆనియన్స్- గార్నిషింగ్ కోసం
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో నాలుగు గుడ్లను పగలగొట్టి అందులో చిటికెడు ఉప్పు, మిరియాల పొడి వేసి నురగ వచ్చేలా బాగా గిలకొట్టి, నూనె రాసిన ఒక గిన్నెలో గానీ ఇడ్లీ ప్లేట్లలో గానీ ఈ మిశ్రమాన్ని పోసి ఆవిరి మీద 10-12 నిమిషాల పాటు ఉడికించాలి.
-తర్వాత దానిని చల్లార్చి నచ్చిన సైజులో చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
-ఇప్పుడు ఒక గిన్నెలో మైదా, మొక్కజొన్న పిండి, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి, కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ బజ్జీల పిండిలా జారుగా కలుపుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేడి చేసి, ముందుగా సిద్ధం చేసుకున్న గుడ్డు ముక్కలను ఈ పిండిలో ముంచి, బంగారు రంగులోకి మారి కరకరలాడే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక పెద్ద పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేవాక ఇందులో సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి వేసి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి, ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారే వరకు వేయించాలి.
-ఇప్పుడు సోయా సాస్, టొమాటో కెచప్, చిల్లీ సాస్ అందులో వేసి ఒక నిమిషం పాటు తక్కుెవ మంట మీద బాగా కలపాలి. సాస్ లు కొద్దిగా చిక్కబడ్డాక, ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్డు ముక్కలను ఇందులో వేసి సాస్ మొత్తం ముక్కలకు పట్టేలా బాగా టాస్ చేయాలి.
-చివరగా రుచి చూసి అవసరమైతే కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ఆకులతో గార్నిష్ చేయాలి. అన్నింటినీ మరోసారి బాగా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి.
-అంతే నోరూరించే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ మంచూరియన్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







