Latest Updates
-
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే! -
పవర్ ఆఫ్ హనుమాన్: ఆంజనేయస్వామి ఆలయం తొలగించబోయిన అధికారులు..4 రోజులైనా ఇంచు కూడా కదలట్లేదు! -
సంతానలేమితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడిలో గర్భాశయం.. ఈ విచిత్ర సంఘటనకి కారణాలేంటి.? -
వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇదే.! -
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం -
అమెరికాలో చీప్,భారత్ లో కాస్ట్లీ : ఇండియాలోనే తయారవుతున్నా..ఐఫోన్ల ధరలు ఎందుకు మండిపోతున్నాయి? -
ఉద్యోగులకు అలర్ట్..మీ గుండెను దెబ్బతీస్తున్న 4 ప్రధాన కారణాలివే! -
స్వీట్ షాప్ స్టైల్ మలై బర్ఫీ..ఈ సింపుల్ రెసిపీ తెలిస్తే ఇకపై బయట కొనరు! -
అంగారకుడి నీచ సంచారం.. ఈ 4 రాశుల వారు కళ్లు తెరిచి ఉండకపోతే పక్కాగా నష్టపోతారు!
పూరీ, చపాతీల్లోకి అదిరిపోయే గోబీ మసాలా.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
సాధారణంగా మన ఇళ్లలో బంగాళదుంప, క్యాబేజీ లేదా క్యాలీఫ్లవర్ తో రెగ్యులర్‌గా ఏదో ఒక కూర వండుతూనే ఉంటాం. కానీ ఎప్పుడూ తినే రొటీన్ కూరలకు భిన్నంగా, రెస్టారెంట్ స్టైల్ లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలని ఉందా? అయితే ఖచ్చితంగా గోబీ మసాలా రుచి చూడాల్సిందే. ఈ నోరూరించే స్పెషల్ రెసిపీని మీ ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

గోబీ మసాలా తయారీకి కావలసిన పదార్థాలు
క్యాలీఫ్లవర్ - 1 పెద్దది
నూనె - 2 టేబుల్ స్పూన్లు
నెయ్యి - 2 నుండి 3 టేబుల్ స్పూన్లు
అల్లం - 1 అంగుళం ముక్క
పచ్చిమిర్చి - 4 లేదా 5
ఆవాలు - అర టీస్పూన్
నల్ల జీలకర్ర (కలోంజి) - అర టీస్పూన్
ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు
కారం - అర టేబుల్ స్పూన్
పసుపు - 1 టీస్పూన్
ఇంగువ - చిటికెడు
కసూరి మేతి - అర టేబుల్ స్పూన్
చింతపండు - కొద్దిగా
కొత్తిమీర కాడలు - కొద్దిగా
ఎండుద్రాక్ష- కొద్దిగా
పంచదార - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
అలంకరణ కోసం: కారా బూందీ, పచ్చిమిర్చి
ఎప్పుడూ ఒకేలా కాకుండా..బ్యాచిలర్స్ కూడా మెచ్చే స్పైసీ టమాటో ఎగ్ కర్రీ!
గోబీ మసాలా తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో వేడినీళ్లు తీసుకుని అందులో చింతపండు వేసి నానబెట్టుకోండి. అలాగే మరో పెద్ద గిన్నెలో వేడి నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి అందులో కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను వేసి పది నిమిషాలు ఉంచండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి బాండీ పెట్టుకోండి. అందులో కొద్దిగా నూనె, నెయ్యి వేసి వేడి చేయండి. ఆ తర్వాత శుభ్రం చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను వేసి సుమారు 4-5 నిమిషాల పాటు సగం ఉడికే వరకు వేయించి ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.
-అదే బాండీలో మిగిలిన నూనె, నెయ్యి వేడి చేయండి. నూనె వేడెక్కాక దంచిన అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర కాడలు, ఆవాలు, నల్ల జీలకర్ర వేసి మంచి సువాసన వచ్చే వరకు 2 నిమిషాలు దోరగా వేయించండి. ఇప్పుడు మంట తగ్గించి అందులో ధనియాల పొడి, కారం, చిటికెడు ఇంగువ, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మసాలాలు మాడిపోకుండా ఒక నిమిషం పాటు వేయించండి.
-ఈ మసాలా మిశ్రమంలో ఒక కప్పు నీళ్లు పోసి బాగా మరిగించండి. నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు, ఎండుద్రాక్షలు వేసి బాగా కలపండి. మూత పెట్టి 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించండి.
-కూర సగం ఉడికిన తర్వాత, చేత్తో కొద్దిగా నలిపిన కసూరి మేతి, ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు రసం, కొద్దిగా పంచదార వేసి కలపండి.
-కూర దగ్గరపడి, నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఈ ఘుమఘుమలాడే గోబీ మసాలాను ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని, పైన ఉప్పు కలిపిన బూందీ, సన్నగా తరిగిన పచ్చిమిర్చితో అలంకరించండి. వేడివేడి పూరీలతో ఈ కూరను తింటే ఆ మధురమైన రుచిని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
