Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్‌తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
వర్షంలో వేడి వేడి టేస్టీ టొమాటో సూప్..ఈ ఒక్క పదార్థం కలిపితే ఆరోగ్యం,అందం రెండూ మీవే!
చల్లని వాతావరణంలో లేదా వాన జల్లుల్లు పడుతున్న సమయంలో వేడివేడిగా ఏదైనా తాగితే బాగుండు అనిపిస్తుందా? లేదా పార్టీలో భోజనానికి ముందు అదిరిపోయే స్టార్టర్ తో అందరినీ ఆకట్టుకోవాలనుకుంటున్నారా? అయితే అందరి మనసు దోచే మొదటి ఎంపిక టొమాటో సూప్. ఇది కేవలం ఆకలిని పెంచడమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అయితే సాధారణ టొమాటో సూప్ నే ఓ చిన్న మ్యాజిక్ తో మరింత ఆరోగ్యకరంగా, ఇంకా రుచికరంగా మార్చేయవచ్చని మీకు తెలుసా? ఆ మ్యాజికల్ ఇంగ్రీడియంట్ ఏంటో కాదు..బీట్ రూట్. టొమాటో సూప్ లో కొద్దిగా బీట్ రూట్ కలపడం వల్ల దాని రంగు మరింత ఆకర్షణీయంగా మారడమే కాకుండా శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడి, మీ చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది. ఇంట్లోనే రెస్టారెంట్ రుచితో ఈ అద్భుతమైన సూప్ ను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.
తయారీకి కావలసిన పదార్థాలు
-టమోటాలు: 4-5, పండినవి
-బీట్ రూట్: 1 చిన్నది
-వెల్లుల్లి రెబ్బలు: 3-4
-బిర్యానీ ఆకు: 1
-నల్ల మిరియాల పొడి: అర టీస్పూన్
-మొక్కజొన్న పిండి (కార్న్‌ఫ్లోర్): 1 టీస్పూన్
-వెన్న: 1 టేబుల్ స్పూన్
-చక్కెర: అర టీస్పూన్
-ఉప్పు: రుచికి సరిపడా

తయారీ విధానం
-ముందుగా టమోటాలను, బీట్‌రూట్‌ను శుభ్రంగా కడిగి, ముక్కలుగా కోసుకోవాలి.
-ఇప్పుడు ప్టవ్ మీద ప్రెజర్ కుక్కర్ పెట్టి ఇందులో తరిగిన టమోటాలు, బీట్ రూట్ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, బిర్యానీ ఆకు వేసి, ఒకటిన్నర కప్పుల నీళ్లు పోయాలి. కుక్కర్ మూతపెట్టి 3-4 విజిల్స్ వచ్చేవరకు లేదా 8-10 నిమిషాల పాటు మెత్తగా ఉడికించాలి.
-చల్లారాక మూత తీసి అందులోని బిర్యానీ ఆకును పక్కకు తీసేయండి. మిగిలిన మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తని ప్యూరీలా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు ఈ ప్యూరీని ఒక జల్లెడ సహాయంతో వడకట్టుకోవాలి. మరీ సన్నని జల్లెడ కాకుండా కాస్త గుజ్జు కూడా కిందకు దిగేలా చూసుకోండి. దీనివల్ల సూప్ చిక్కగా, రుచిగా వస్తుంది.
-ఇప్పుడు ఒక పాన్ లో వెన్న వేసి కరిగించి అందులో మొక్కజొన్న పిండి వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. ఆ తర్వాత వడకట్టిన టొమాటో బీట్ రూట్ ప్యూరీని నెమ్మదిగా పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.
-ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చక్కెర, నల్ల మిరియాల పొడి వేసి బాగా కలపాలి. సూప్ మరీ చిక్కగా అనిపిస్తే కొన్ని నీళ్లు పోసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి.
-సూప్ కాస్త చిక్కబడ్డాక, స్టవ్ ఆఫ్ చేయండి. వేడివేడి టొమాటో బీట్ రూట్ సూప్ రెడీ.
-సూప్ ను ఒక బౌల్ లోకి తీసుకుని పైన కొద్దిగా తాజా క్రీమ్ లేదా మరికాస్త వెన్నతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేయండి. కరకరలాడే బ్రెడ్ ముక్కలతో తీసుకుంటే రుచి అమోఘంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications