Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఈ క్రీమీ షాహీ చికెన్ కుర్మా రుచి చూస్తే..ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
భారతీయ వంటకాలలో ముఖ్యంగా మొఘలాయ్ వంటకాల్లో షాహీ అనే పదం వినగానే మనకు రాజసం, అద్భుతమైన రుచి గుర్తుకు వస్తాయి. షాహీ అంటే రాజరిక అని అర్థం. ఈ పదం చేర్చబడిన ఏ వంటకమైనా సరే అది సాధారణమైనది కాదు, ఎంతో ప్రత్యేకమైనది.
అటువంటి రాజభోజనాలలో ఒకటి షాహీ చికెన్ కుర్మా. సాధారణ చికెన్ కూరలకు, షాహీ కుర్మాకు చాలా తేడా ఉంది. మీ ఇంట్లోనే షాహీ చికెన్ కుర్మా ఎలా చేసుకోవాలొ ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
చికెన్: 750 గ్రాములు
చిక్కటి పెరుగు: 1 కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: అర టీస్పూన్
ధనియాల పొడి: 1 టేబుల్ స్పూన్
కారం: 1 టీస్పూన్
జీడిపప్పు: 15-20
బాదంపప్పు: 10-12
గసగసాలు: 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయలు: 2 పెద్దవి
నెయ్యి లేదా నూనె: 4-5 టేబుల్ స్పూన్లు
యాలకులు: 4
లవంగాలు: 4-5
దాల్చినచెక్క: 1 అంగుళం ముక్క
బిర్యానీ ఆకు: 1
షాజీరా: అర టీస్పూన్
పాలు: ½ కప్పు
ఫ్రెష్ క్రీమ్: 3-4 టేబుల్ స్పూన్లు
కుంకుమపువ్వు: చిటికెడు
గరం మసాలా: 1 టీస్పూన్
కెవ్రా వాటర్ లేదా రోజ్ వాటర్: 1 టీస్పూన్
సన్నగా తరిగిన కొత్తిమీర
వేయించిన బాదం పలుకులు
తయారీ విధానం
-ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి, నీరు లేకుండా ఆరబెట్టాలి.
-తర్వాత ఒక పెద్ద గిన్నెలో చికెన్ ముక్కలు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి మొత్తం బాగా కలిపి గిన్నెపై మూత పెట్టి 4 గంటలు లేదా రాత్రంతా ఫ్రిజ్ లో నానబెట్టాలి.
-జీడిపప్పు, బాదంపప్పు, గసగసాలను గోరువెచ్చని నీటిలో అరగంట సేపు నానబెట్టాలి.
-నానిన తర్వాత, బాదంపప్పుపై ఉన్న తొక్కను తీసివేయాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ పోసి ఉల్లిపాయలు వేసి వేయించుకొని స్టవ్ ఆపేయాలి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో నానబెట్టిన పప్పులు,వేయించిన ఉల్లిపాయలు, కొద్దిగా నీరు పోసి మెత్తని చిక్కని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-ఒక మందపాటి గిన్నె స్టవ్ మీద పెట్టి నెయ్యి లేదా నూనె వేడి చేశాక బిర్యానీ ఆకు, దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, షాజీరా వేసి మంచి సువాసన వచ్చేవరకు వేయించాలి.
-ఇప్పుడు మారినేట్ చేసిన చికెన్ ముక్కలను గిన్నెలో వేసి మీడియం మంట మీద 5-7 నిమిషాల పాటు చికెన్ రంగు మారే దాకా వేయించాలి.
-తర్వాత మంటను పూర్తిగా తగ్గించి ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ ను అందులో వేసి 3-4 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. తర్వాత మూత పెట్టి తక్కువ మంట మీద చికెన్ మెత్తబడే వరకు ఉడికించాలి.
-చికెన్ ఉడికిన తర్వాత గ్రేవీ చిక్కగా అనిపిస్తే అర కప్పు పాలు లేదా గోరువెచ్చని నీరు పోసి కావలసిన కన్సిస్టెన్సీకి సర్దుబాటు చేసుకోవాలి.
-చివరగా ఫ్రెష్ క్రీమ్, గరం మసాలా, గోరువెచ్చని పాలలో నానబెట్టిన కుంకుమపువ్వు, కెవ్రా వాటర్ లేదా రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. మరో 2-3 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే షాహీ చికెన్ కుర్మా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









