Latest Updates
-
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి! -
ఈ టేస్ట్ నెవర్ బిఫోర్.. సండే స్పెషల్ పాలకూర చికెన్, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.! -
సెప్టెంబర్ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.! -
పసిపిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎప్పటినుంచి ఇవ్వాలి? ఎలా పెడితే ఆరోగ్యానికి మంచిది? -
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే!
ఈ క్యారెట్ పాయసం చేస్తే.. గిన్నెలో ఒక్క చుక్క కూడా వదలకుండా లాగించేస్తారు!
పాయసం అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి..సాధారణంగా మనం సేమియా, సగ్గుబియ్యం లేదా బియ్యంతో పాయసం చేస్తుంటాం. పప్పు పాయసం కూడా అప్పుడప్పుడు చేసుకుంటాం. కానీ ఎప్పుడూ ఒకే రకమైన పాయసం తిని విసుగొస్తుంటే, నోటికి రుచిగా, ఒంటికి ఆరోగ్యంగా ఉండేలా వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటే మాత్రం క్యారెట్ పాయసం బెస్ట్ ఆప్షన్. గిన్నెలో ఒక్క చుక్క కూడా వదలకుండా ఖాళీ చేసేస్తారు. అద్భుతమైన రుచిని అందించే ఆరోగ్యకరమైన క్యారెట్ పాయసాన్ని సులభంగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
తాజా క్యారెట్లు - 5
కాచి చల్లార్చిన పాలు - 1 కప్పు
పచ్చి కొబ్బరి తురుము - కొద్దిగా
బెల్లం తురుము - మీ తీపికి సరిపడా
నెయ్యి - అవసరమైనంత
జీడిపప్పు - 10 నుండి 15 వరకు
ఎండుద్రాక్ష- 8 నుండి 10 వరకు
యాలకుల పొడి - చిటికెడు
ఎప్పుడూ ఒకేలా కాకుండా..బ్యాచిలర్స్ కూడా మెచ్చే
స్పైసీ టమాటో ఎగ్ కర్రీ!
తయారీ విధానం
-ముందుగా తీసుకున్న తాజా క్యారెట్లను శుభ్రంగా నీళ్లలో కడిగి, పైన ఉన్న తొక్కను తీసేయండి. ఆ తర్వాత వాటిని సన్నని తురుములా పట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, మందంగా ఉన్న ఒక బాణలి పెట్టి, అందులో కొద్దిగా నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసి, మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి.
-బాగా వేగిన క్యారెట్ మిశ్రమాన్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దానిని మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-మరొకసారి స్టవ్ మీద బాండీ పెట్టి, రెండు స్పూన్ల నెయ్యి వేడి చేయాలి. అందులో జీడిపప్పు, ఎండుద్రాక్ష, కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము వేసి, అవి దోరగా, బంగారు రంగులోకి మారే వరకు వేయించుకోవాలి.
-అదే బాండీలో ఒక గ్లాసు నీళ్లు పోసి, మీ రుచికి తగినట్లుగా బెల్లం తురుమును వేసి కరిగేలా మరిగించాలి. పాయసం చిక్కదనాన్ని బట్టి అవసరమైతే మరికొన్ని నీళ్లు కలుపుకోవచ్చు. నీళ్లు, బెల్లం మిశ్రమం బాగా మరుగుతున్నప్పుడు, గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ ను వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి.
-ఇది ఉడుకుతున్న సమయంలో ఒక కప్పు పాలు పోసి నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. పాయసం ఒక పొంగు వచ్చిన తర్వాత, అందులో మంచి సువాసన కోసం చిటికెడు యాలకుల పొడి చల్లుకోవాలి.
-చివరిగా పైనుంచి మరో నాలుగైదు చెంచాల కమ్మని నెయ్యి వేసి కలుపుకుని స్టవ్ ఆపేసుకుంటే చాలు ఘుమఘుమలాడే వేడి వేడి క్యారెట్ పాయసం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
