Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
Sankranthi recipe : సంక్రాంతికి ఫర్ఫెక్ట్ గా అరిసెలు రావాలంటే ఇలా చేయండి
సంక్రాంతి అంటే ఎవరికైనా ఫస్ట్ గుర్తుకువచ్చేది పిండివంటలు. అందులోనే ముఖ్యంగా అరిసెలు. సంక్రాంతికి అరిసెలు లేని తెలుగిళ్లు ఉండదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొన్ని దశాబ్దాలుగా సంక్రాంతి అంటే ఖచ్చితంగా అరిసెలు ఉండాల్సిందేనన్న సంప్రదాయం తెలుగు రాష్ట్రాలో ముఖ్యంగా ఆంధ్రాలో కొనసాగుతుంది. అరిసెలు ఆరోగ్యానికి కూడా చాలామంచిదని అనేకమంది నిపుణులు అనేక సందర్భాలలో చెప్పారు. అయితే సంక్రాంతి అరిసెలు మంచి టేస్ట్ రావాలంటే మాత్రం కొన్ని టిప్స్ ఖచ్చితంగా పాటించాలి. ఈ సంక్రాంతికి ఇంట్లో అరిసెలను చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
అరిసెలు తయారీకి కావాల్సిన పదార్థాలు
-రేషన్ బియ్యం
-బెల్లం
-యాలకల పొడి
-నెయ్యి
-ఆయిల్
అరిసెలు తయారీ విధానం
-ముందుగా ఒకటిన్నర కేజీ బియ్యాన్ని(రేషన్ బియ్యం బెస్ట్)ఒక రోజంతా
నానబెట్టుకోండి.
-తర్వాత వడగిన్నెలో రైస్ వేసి నీళ్లు మొత్తం పోయేంతవరకు 10 నిమిషాల పాటు అలా వదిలేయండి.
-తర్వాత ఈ రైస్ ఇంట్లో మిక్సీలో అయినా లేదా బయట మిల్లుకి ఇచ్చి అయినా గ్రైండ్ చేయించుకోండి.
-తర్వాత బియ్య పిండి మొత్తాన్ని బాగా జల్లించుకోవాలి.
-తర్వాత పిండిలో తడి ఆరిపోకుండా పిండిమీద ఏదైనా గుడ్డ కప్పి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు 750 గ్రాముల పాకం బెల్లాన్ని చాకుతో తురుముకోండి.
-తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో బెల్లం తరుము,1 టీగ్లాస్ నీళ్లు పోసి బెల్లాన్ని కరగనిస్తే చాలు. పాకం రానవసరం లేదు.
-ఇప్పుడు అరిసెల పిండి చేసుకోవాలనుకుంటున్న వెడల్పాటి గిన్నెలోకి ఈ బెల్లం నీళ్లని వడగట్టుకోండి.
-ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి ఉడికించండి. తిప్పుడూ పాకం వచ్చేదాకా ఉంచండి.
-పాకం ఎలా ఉండాలంటే నీళ్లు పోసిన చిన్న గిన్నెలో పాకం వేస్తే చేతికి అంటుకోకుండా మెత్తటి ఉండలా రావాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బెల్లం పాకంలో ఒకటిన్నర టీస్పూన్ యాలకల పొడి, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోండి. తర్వాత పిండి మొత్తాన్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు రాకుండా బాగా కలుపుకోవాలి.
-కలిపిన పిండి ఆరిపోకుండా దానిమీద కొంచెం ఆయిల్ లేదా నెయ్యి వేసి మూత పెట్టండి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ పోసి వేడి చేయండి. ఆయిల్ బాగా వేడెక్కే లోగా ఆయిల్ ప్యాకెట్ కవర్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి దానిమీద పిండిని అరిసెలుగా వత్తుకోండి.
-బాగా కాగిన నూనెలో కొన్ని కొన్నిగా వాటిని వేస్తూ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఆయిల్ లో నుంచి తీసేసి అట్లకాడతో అరిసెను వత్తుకోండి. అంతే సంక్రాంతి స్పెషల్ అరిసెలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications








