జస్ట్ 10 నిమిషాల్లోనే హెల్తీ,టేస్టీ బ్రేక్ ఫాస్ట్..టమాటో పచ్చడితో తింటే స్వర్గమే..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

పొద్దున్నే మనం తినే బ్రేక్ ఫాస్ట్ లో ఎక్కువగా దోశ, ఇడ్లీ.పూరీ, బోండా లేదా వడ వంటివి ఉంటాయి. అయితే ఎప్పుడూ ఇవే తిని తిని బోర్ కొట్టేసిందా? అయితే ఈసారి కొత్తగా గోంధుమపిండితో హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ట్రై చేయండి. గోధుమ పిండితో చేసుకునే దోశలు చాలా ఆరోగ్యకరమైనవి. వీటిని కేవలం 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. క్రిస్పీగా, రుచికరంగా ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్లీ మళ్లీ కావాలి అనిపించేలా ఉంటాయి. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్ గా చేసుకునే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఇది. ఈజీగా 10 నిమిషాల్లో హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు

-నెయ్యి
-ఆవాలు
-జీలకర్ర
-అల్లం
-టమాటో
-ఉల్లిపాయ
-ఉప్పు
-మిరపకాయ
-కరివేపాకు
-కొత్తిమీర
-గోధుమ పిండి

Simple Fast and Healthy Breakfast Wheat Dosa Recipe in Telugu

తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చెయ్యాలి.

-నెయ్యి కరిగిన తర్వాత అందులో అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ పచ్చి శెనగపప్పు, 1 టీస్పూన్ మినపప్పు వేసి వీటన్నింటిని లైట్ గా వేయించుకోవాలి.

-పోపు దినుసులు లైట్ గా వేయించాక అందులో 1 టీస్పూన్ సన్నగా తరగిన అల్లం ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని లైట్ గా వేగేంతవరకు వేయించుకోండి.

-తర్వాత అందులో సన్నగా కట్ చేసిన రెండు రెమ్మల కరివేపాకు వేసి వేపుకున్నాక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి.

-ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేదాకా వేయించుకున్నాక అందులో 1 టమాటో ముక్కలు వేసి కొద్దిగా మెత్తబడేదాకా వేయించి కొత్తిమీర తరుగు చల్లుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. పాన్ ను పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు ఓ బౌల్ లో ఒకటిన్నర కప్పు గోధుమపిండి, రుచికి సరిపడా ఉప్పు, ముందుగా వేయించిన మిశ్రమం మొత్తాన్ని వేసి, 2 కప్పుల నీళ్లు పోసి కలుపుకోవాలి. దోశ పిండి కంటే కొద్దిగా చిక్కగా ఉండేట్లు కలుపుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి వేడి చేశాక దోశలను వేసుకొని మీడియం మంట మఅద కాల్చుకోండి. వీటిని టమాటో చట్నీతో తింటే అదిరిపోతుంది.

[ of 5 - Users]
Story first published: Friday, August 15, 2025, 11:48 [IST]
Desktop Bottom Promotion