Latest Updates
-
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే!
క్రిస్పీ అండ్ టేస్టీ గోబి పకోడా: ఈవెనింగ్ స్నాక్
పకోడా అనేది ఇండియన్ ఫ్రైడ్ స్నాక్. ఈ స్నాక్ ను వివిధ రకాలైన పదార్థాలతో తయారుచేస్తారు. పకోడాలను తయారుచేయడానికి వెజిటేరియన్ మరియు నాన్ వెజిటేరియన్ రెండింటిని ఉపయోగించి తయారుచేస్తారు. ఇది ఒక అత్యంత పాపులర్ అయినటువంటి ఈవెనింగ్ స్నాక్. వీటని ఒక కప్పు కాఫీ లేదా టీతో తింటూ ఎంజాయ్ చేయవచ్చు.
పకోడో శెనగపిండి మిశ్రమంలో డిప్ చేసి, డీప్ ఫ్రై చేస్తారు. శెనగపిండి స్థానంలో కార్న్ ఫ్లోర్, పెసరపిండి, మైదా ఇలా వివిధ రకాలైన పదార్థాలను ఉపయోగిస్తారు . ఈ పకోడాను వేడి నూనెలో వేసి డీఫ్ ప్రై చేస్తారు. గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, కారం, జీలకర్ర వంటి పదార్థాలు వేసి మరింత రుచికరంగా తయారుచేస్తారు. మరి గోబీ పకోడాను ఎలా తయారుచేయాలో ఒక సారి చూద్దాం..

గోబీ(కాలీఫ్లవర్ పువ్వులు): 1cup(మీడియం సైజ్)
శెనగపిండి: 1cup
పచ్చిమిర్చి: 2 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
కారం: 1tsp
వాము: 1tsp
గరం మసాలా: 1tsp
బేకింగ్ సోడా: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1cup(వేయించడానికి సరిపడా)
నీళ్ళు : 1cup
తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక గిన్నెలో శెనగపిండి వేసి తర్వాత నీళ్ళు పోసి, ఉండలు కట్టకుండా కొంచెం చిక్కగా కలుపుకోవాలి.
2. తర్వాత అందులో అజ్వైన్, కారం, ఉప్పు, బేకింగ్ సోడా, పచ్చిమిర్చి, మరియు గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి.
3. మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి తర్వాత పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి, నూనె వేడి అయ్యాక అందులో శుభ్రం చేసి మీడియం సైజ్ పువ్వులుగా విడిపించి పెట్టుకొన్నికాలీఫ్లవర్ పువ్వులను వేసి పిండి మిశ్రమం బాగా కలిసేలా చేయాలి.
5. తర్వాత కాగుతున్న నూనెలో పిండిలో డిప్ చేసిన కాలీఫ్లవర్ వేసి మీడియం మంట మీద గోల్డో బ్రౌన్ కలర్ వచ్చే వరకూ క్రిస్పీగా వేయించుకోవాలి.
6. ఇలా మొత్తం పువ్వులను పకోడా వేయించుకోవాలి. అంతే కాలీఫ్లవర్(గోబి) క్రిస్పీ పకోడా రెడీ. వీటిని టమోటో సాస్ లేదా కొత్తిమీర చట్నీతో సర్వ్ చేయండి.



Click it and Unblock the Notifications











