Latest Updates
-
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే!
వెయిట్ లాస్ స్నాక్ క్రిస్పీ రవ్వ వడ
సహజంగా మీరు ఉద్దిన్ వడ, మసాలా వడ, శెనగపప్పు వడ, మినప వడలు ఇలా వివిధ రకాల వడలను రుచి చూసే ఉంటారు. అయితే, రవ్వతో తయారుచేసే వడ టేస్ట్ ఎలా ఉంటుందో మీకు తెలుసా? చాలా రుచికరంగా క్రిస్పీగా ఉంటుంది. అంతే కాదు, బరువు తగ్గాలనుకొనే వారికి మరియు డైట్ ను అనుసరించే వారికి ఇది ఒక లోక్యాలరీ స్నాక్ రిసిపి.
ఈ క్రిస్పీ టేస్టీ లోక్యాలరీ వడను తయారుచేయడం చాలా సులభం. ఉద్దివడ, మసాల వడ తయారుచేసుకొన్నట్లే, తయారుచేసే విధానం ఒక్కటే, అయితే, ఈ సూజి వడకు రవ్వ మరియు బియ్యం పిండి ఉపయోగించి తయారుచేసుకుంటారు. మరి మీరు కూడా ఈ క్రిస్పీ స్నాక్ ను రుచి చూడాలనుకుంటున్నారు. మరి తయారుచేయు విధానం తెలుసుకోండి...

కావల్సిన పదార్థాలు:
సన్నరవ్వ: 1cup
బియ్యంపిండి: 1/2cup
కొత్తిమీర: 1/2cup(సన్నగా తరగాలి)
కరివేపాకు: 1/2cup
ఉల్లిపాయ: 2(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
నూనె : ఫ్రై చేయడానికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా సన్నరవ్వను బియ్యం పిండిలో వేసి బాగా మిక్స్ చేయాలి. రెండూ బాగా కలగలిసే వరకూ మిక్స్ చేయాలి.
2. తర్వాత అందులో ఉప్పు వేసి తిరిగి మిక్స్ చేయాలి.
3. ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యిని వేడి చేసి పిండిలో వేసి కలగలుపుకోవాలి.
4. తర్వాత ఈ పిండిలోనే సన్నగా తరిగిపెట్టుకొన్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమిర తరుగు వేసి, మొత్తం మిశ్రమాన్ని బాగా కలగలుపుకోవాలి. కలిపేటప్పుడే కొద్దిగా నీళ్ళు కూడా జోడిస్తూ నిధానం మృదువుగా కలుపుకోవాలి.
5. ఇప్పుడు ఈ పిండి నుండి కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకొని అరచేతిలో పెట్టుకొని, వడలాగ వత్తుకోవాలి.
6. ఇలా అన్ని వత్తిపెట్టుకొనే లోపు, స్టౌ మీద పాన్ పెట్టి, నూనె పోసి వేడయ్యాక అందులో వడలను అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ రెండువైపులా కాలే వరకూ వేగించుకోవాలి. అంతే క్రిస్పీ సూజి (రవ్వ)వడ రెడీ.



Click it and Unblock the Notifications











