ఇడ్లీ పాయసం? - దీపావళి పండుగ వంటకం!

By B N Sharma

Crushed Idly Payasam
ఇడ్లీ పాయసం తయారు చేయటానికి కావలసిన పదార్ధాలు -
ఇడ్లీలు 4 నెం.లు
కాచిన చిక్కటి పాలు - అర లీటరు
షుగర్ - 6 స్పూన్లు
కాజు, బాదం, పిస్తాలు - ఒక గుప్పెడు
యాలకులు పౌడర్ - అర స్పూను
కుంకుమ పువ్వు కొద్దిగా
గులాబి రేకులు కొద్దిగా

చేసే విధానం ....
ఇడ్లీలను మెత్తగా తయారు చేయండి. పాలను స్టవ్ పై బాగా మరిగించి చిక్కగా చేయండి. అందులో తగినంత పంచదార వేయండి. మెత్తగా చేసిన ఇడ్లీలను ఆ పాలలో వేయండి. కొద్ది సేపు వేడి చేయండి. స్టవ్ పై నుండి దింపి వాటికి బాదం, కాజు, యాలకుల పౌడర్, కుంకుమ పువ్వు కలపండి. ఈ వంటకాన్ని ఆకర్షణీయమైన పాత్రలో వుంచి దానికి అప్పటికే సిద్ధం చేసుకున్న ఎర్రటి గులాబి రేకులను అలంకరించండి. ఎంతో తీపిగా వుండి కుటుంబ సభ్యులను ఆనందపరిచే పండుగ వంటకం అతి తక్కువ సమయంలో రెడీ!

Story first published: Monday, October 17, 2011, 15:32 [IST]
Desktop Bottom Promotion