For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రీన్ పీస్ పాన్ కేక్: హెల్తీ స్నాక్ రిసిపి

By Super Admin
|

చలికాలం వచ్చెస్తోంది. ఈ కాలంలో రోగాలు దరి చేరతాయన్న భయం లేకుండా హాయిగా అన్నీ తినచ్చు. పైగా ఇది కూరగాయలు, పళ్ళ సీజన్ కూడా.మీ ఫ్రూట్ బాస్కెట్లో ఆరెంజ్ తన రంగుతో కనువిందు చేస్తే కాలీఫ్లవర్ రుచితో మీ వంటలకి అదనపు రుచినిస్తుంది.

శీతాకాలం దొరికే కూరగాయల గురించి మాట్లాడుకునేటప్పుడు పచ్చి బఠానీ గురించి మర్చిపోతే ఎలా?? బఠాణీలతో పులావ్, ప్యాన్ కేక్ ఇలా రకరకాల వంటలు చెయ్యవచ్చు.

ఈరోజు బఠాణీ ప్యాన్ కేక్ తయారీ విధానం వివరించాము. దీనిని మధ్యాహ్నపు స్నాక్ లాగ చేసుకోవచ్చు లేదా ఉదయం అల్పాహారంలో కూదా తీసుకోవచ్చు.

ఇక దీని తయారీకి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం చూద్దామా..

ఎన్ని ప్యాన్ కేక్స్ తయారవుతాయి-30

సామాన్లు సమకూర్చుకోవడానికి-15 నిమిషాలు

తయారీ సమయం-20 నిమిషాలు

కావాల్సిన పదార్ధాలు:

1.పచ్చి బఠాణీ-ఉడికించనవి 3/4 కప్పు.

2.బియ్యప్పిండి-1/2 కప్పు

3.శనగపిండి-1/2 కప్పు

4.పసుపు-1/4 టీ స్పూను

5.ఫ్రూట్ సాల్ట్-1/2 టీ స్పూను

6.ఉప్పు-రుచికి తగినంత

7.నూనె-2 టేబుల్ స్పూన్లు

8.టమాటాలు-1/4 కప్పు(సన్నగా తరగాలి)

9.క్యారట్లు-1/2 కప్పు(తురమాలి)

10.పచ్చి మిరపకాయల తరుగు-2 టేబుల్ స్పూన్లు

11.తురిమిన పనీర్-4 టేబుల్ స్పూన్లు

12.నీరు-తగినంత

తయారీ విధానం:

1.ఉడికించిన బఠాణీని మెత్తగా రుబ్బాలి. ఒక గిన్నె తీసుకుని దానిలో బఠాణీ ముద్ద వేసి దానికి బియ్యప్పిండి, శనగపిండి, పసుపు, పచ్చి మిర్చి తరుగు, ఉప్పు చేర్చాలి.

Green Peas Pancake

2.నీరు పోసి కాస్త చిక్కగా అయ్యేవరకూ కలిపి దానిలో ఫ్రూట్ సాల్ట్ వెయ్యాలి.

3.ఫ్రూట్ సాల్ట్ వేసాకా ఎక్కువగా కలపకూడదు.ఎక్కువగా కలిపితే ప్యాన్ కేక్స్ మెత్తగా రావు.ఇప్పుడు ఒక పెనం తీసుకుని వేడి చేసి దానికి నూనె రాయాలి.ఇలా చేస్తే పెనం మీద నుండి ప్యాన్ కేక్స్ తియ్యడం సులువు.

Green Peas Pancake

4.ఇప్పుడొక గరిటెతో ప్యాన్ కేక్ మిశ్రమాన్ని తీసుకుని పెనం మీద దోస లాగ పొయ్యాలి. చిన్న చిన్న ప్యాన్ కేక్స్ పోసుకుంటే తియ్యడం సులువు.

Green Peas Pancake

5.ఇప్పుడు వీటి మీద తురిమిన పనీర్,క్యారెట్, టమాట వేసి పైన కొంచెం నూనె చిలకరించాలి.ప్యాన్ కేక్ ఒక వైపు కాలాక మరొక వైపు తిప్పాలి.

Green Peas Pancake

6.రెండో వైపు కూడా కాలాకా మీ ప్యాన్ కేక్స్ తయారు.వీటిని వేడి వేడిగా వడ్డించడమే.

Green Peas Pancake

ఇవి చట్నీ లేదా సాస్‌తో కలిపి వడ్డిస్తే మరింత రుచికరంగా ఉంటాయి.విటమిన్లు, పీచు, మినరల్స్ కలిగిన ఈ స్నాక్ ఆరోగ్యానికి మంచిది.

మరి మర్చిపోకుండా దీనిని ప్రయత్నిస్తారు కదా.

English summary

Green Peas Pancake: Healthy Snack Recipe

Winter is knocking at the door. This is the season when you can enjoy foods without thinking of the physical ailments. This is also the season of fruits and vegetables. If oranges make your fruit basket brighter, cauliflower is there to make your dishes taste better.
Story first published:Tuesday, November 8, 2016, 12:49 [IST]
Desktop Bottom Promotion