Latest Updates
-
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే!
Holi Special Sweet Recipe: పిస్తా బర్ఫీ: హోలీ స్పెషల్ రిసిపి
బర్ఫీ ఇది ఒక స్వీట్ డిష్ . ఇండియన్ స్వీట్స్ లో ఒక రుచికరమైనది. దీన్ని కోవాతో తయారుచేస్తారు . ఏ కార్యక్రమానికైనా ఇది ఒక ఫర్ ఫెక్ట్ ఎంపిక .కలర్ ఫుల్ హోలి దగ్గరలో రాభోతోంది. ఈ కలర్ ఫుల్ హోళికి కలర్ ఫుల్ గా స్వీట్స్ తయారుచేసుకోవడం పరిపాటి.
మీ ఇంట్లో వారితో పాటు, అథితులకు కూడా హ్యాపీగా ఈ స్వీట్స్ ను సర్వ్ చేయవచ్చు. హోలీ పార్టీ మెనులో ఉండాల్సిన వాటిలో ఫర్ ఫెక్ట్ స్వీట్ పిస్తా బర్ఫీ. మరి మీరు కూడా దీన్ని తయారుచేయాలనుకుంటే హోలీ కంటే ముందే ఒక సారి ట్రీై చేసి చూడండి...

కావల్సిన పదార్థాలు:
పిస్తా: 1cup
పంచదార: 1cup
నీరు: ½ cup
నెయ్యి: ¾ cup
కోవా/mawa: ½cup
ఏలకుల పొడి: చిటికెడు
గ్రీన్ ఫుడ్ కలర్: కొన్ని చుక్కలు
తయారుచేయు విధానం
1. ముందుగా పిస్తాపప్పులను వేడినీళ్ళలో ఒక 5నిముషాలు ఉడకించాలి. స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు పిస్తాలను నీటి నుండి వేరుచేసి, ఒక ప్లేట్ కి తీసుకొని, వాటికి పొట్టు తొలగించి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత ఫ్రైయింగ్ పాన్ స్టౌమీద పెట్టి, కొద్దిగా నెయ్యి వేసి, ఈ పిస్తాపప్పులను వేసి క్రిస్పీగా రోట్ చేసుకొని, పక్కన తీసి పెట్టి చల్లారనివ్వాలి.
4. ఇప్పుడు చల్లారిన పిస్తాపప్పును చల్లారినిచ్చి మిక్సీ జార్ లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి.
5. ఇప్పుడు ఒక డీప్ బాటమ్ పాన్లో నీళ్ళు పోసి బాగా మరిగించి అందులో పంచదార వేసి బాగా మరిగించాలి.
6. పంచదార వేడినీటిలో కరిగి, చిక్కగా తయారయ్యే సమయంలో అందులో పిస్తాపౌడర్, గ్రీన్ ఫుడ్ కలర్ మరియు కోవా వేసి బాగా మిక్స్ చేయాలి.
7. మీడియం మంట మీద 15-20నిముషాలు ఉడకించుకోవాలి. ఇప్పుడు నిధానంగా నెయ్యి, యాలకుల పొడి వేసి నిధానంగా కలియబెడుతూ 10నిముషాలు ఉడికించుకోవాలి.
8. మొత్తం మిశ్రమం పాన్ కు వదలువుతున్నప్పుడు స్టౌ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ప్లేట్ కు కొద్దిగా నెయ్యి రాసి ఈ మొత్తం మిశ్రమాన్ని ప్లేట్ లో పోయాలి . ఇది మొత్తం ప్లేట్ లో సర్ధాలి. చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి. అంతే పిస్తా బర్ఫీ రెడీ.



Click it and Unblock the Notifications











