For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాగో పాయసం: నవరాత్రి స్పెషల్

సాగో పాయసం: నవరాత్రి స్పెషల్

|

తినదగిన తెల్ల ముత్యాలంటే నాకు ఎల్లప్పుడూ అశ్చర్యంగా ఉండేది. అవేనండి సగ్గుబియ్యం. వండక ముందు తెల్లగా వండిన తరువాత పారదర్శకంగా ఉంటాయి వీటినే ఆంగ్లం లొ 'సాగో అని హిందీ లొ 'సబుదనా' అని అంటారు.

యావత్భారతదేశం లొ వ్రతం నాడు తినబడే అహార పదార్ధం గా పరిగణించబడేది. వీటిని ఉపయోగించి రక రకాల ఆహార పదార్ధాలు తయారు చేస్తారు. అందరికీ నచ్చె విధంగా సగ్గుబియ్యం తో వంటకాలు తయారు చెస్తారు. అమ్మ సగ్గుబియ్యం తీసిందంటే ఇక ఆ రోజు ఏదో పండగ ఉందనుకుంటారు పిల్లలు. వేడి వేడి పాయసాన్ని ఊదుకుంటూ తాగడంలోనే ఆ పండగ ఆనందం అంతానూ... మరి శరనవరాత్రి సందర్భంగా సాగో పాయం ఎలా తయారు చేయాలో ఈ క్రింది పద్దతిని ఫాలో చేయండి....

Sago Payasam - Navratri Special

కావల్సిన పదార్థాలు:
పాలు: 1/2ltr
సగ్గుబియ్యం: 1/4cup
పంచదార : 1cup
నెయ్యి: 2tsp
బాదం,జీడిపప్పు, ఏలకులు: 3tbsp(పొడి చేసుకోవాలి)

తయారుచేయు విధానం:
1. ముందుగా పాలను బాగా మరిగించి అందులో సగ్గు బియ్యం వేసి ఉడికించాలి.
2. తర్వాత నేతిలో జీడిపప్పు, కిస్ మిస్ లను వేయించి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత సుమారు పది నిముషాలు సగ్గు బియ్యం ఉడుకుతుంది.
4. ఇప్పుడు చక్కెర వేసి కలిపి మరికొంత సేపు ఉడికించాలి.
5. చివరగా బాదం, ఏలకులు పొడి వేయించిన జీడిపప్పు, ద్రాక్ష వేసి కలి క్రిందికి దింపుకొని వేడి వేడి గా సర్వ్ చేయాలి.

English summary

Sago Payasam - Navratri Special

I have always been fascinated by the little edible pearls that are wonderfully white when raw and almost translucent when cooked. Yes you have guessed it right – these little wonders are called sago in English and sabudana in Hindi.
Desktop Bottom Promotion