Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
మ్యాంగో రబ్రీ : ఫాదర్స్ డే స్పెషల్
ఫాదర్స్ డే జూన్ 15. మీ ఫాదర్ కు వెరైటీగా ఏదైనా స్పెషల్ గా తయారుచేసి సర్ ప్రైజ్ చేయండి. మీ నాన్నకు నచ్చిన వంటలు ఎన్నో ఉండవచ్చు. కానీ వెరైటీగా తియ్యతియ్యగా అందిస్తే మరింత ఎక్కువ ఇష్టపడవచ్చు. అయితే ప్రస్తుతం మనకు సీజనల్ ఫ్రూట్ గా మామిడి పండ్లు అందుబాటులో ఉన్నాయి. మరి మీ నాన్నకు ఇష్టమైన వాటిలో మామిడి పండ్లు, వాటితో తయారుచేసే వంటలు టాప్ లిస్ట్ లో ఉండవచ్చు .
మామిడి పండ్లు ఒక చక్కటి రుచికరమైన డిజర్ట్స్ మాత్రమే కాదు, మామిడిపండ్లలో ప్రోటీన్స్, న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి. మీ నాన్న కూడా ఈ హెల్తీ మ్యాంగో రబ్రీ స్వీట్ డిష్ ను ఇష్టపడవచ్చు. దీన్ని తయారుచేయడం సులభం మాత్రమే కాదు, హెల్తీ కూడా. మరి మీ ఫాదర్, ఈ ఫాదర్స్ డే స్పెషల్ గా మ్యాంగో రబ్రీ తయారు చేసి సర్ ప్రైజ్ చేస్తారు కదూ....
కావల్సిన పదార్థాలు:
పాలు: 3cups
బాగా పండిన మామిడిపండు ముక్కలు: 1cup
పంచదార: 1/4cup(స్వీట్ సరిపడా మరింత జోడించుకోవచ్చు)
పిస్తాచో: 5-6
బాదం: 4
యాలకలు పొడి 1/2tsp
కుంకుమ పువ్వు: 4small strands

తయారుచేయు విధానం:
1. ముందుగా వేడినీళ్ళలో బాదం వేసి 20నిముషాలు నానబెట్టుకోవాలి. 20 నిముషాల తర్వాత బాదం నీరు వంపేసి వాటికి పొట్టు తొలగించాలి. తర్వాత పల్చగా స్లైసులుగా కట్ చేసుకోవాలి . అలాగే పిస్తాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఉపయోగించేటప్పుడు చూడటానికి చాలా నీట్ గా కనబడాలి.
2. తర్వాత కుంకుమ పువ్వును కొద్దిగా వేడి పాలలో వేసి నానబెట్టుకోవాలి. తర్వాత బాగా పండిన మామిడి ముక్కలను మిక్సీ జార్ లో వేసి కొద్దిగా చిక్కటి పేస్ట్ లా తయారుచేసుకోవాలి.
3. తర్వాత పాలను ఒక గిన్నెలో పోసి పాలు సగం అయ్యే వరకూ బాగా మరిగించాలి. పాలు చిక్కగా సగం అయినప్పుడు అందులో పంచదార వేసి పాలలో పూర్తిగా కరగనివ్వాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకొని చల్లారనివ్వాలి.
4. పాలు పూర్తిగా చల్లారిన తర్వా అందులో మామిడిపండు పేస్ట్, యాలకుల పొడి, పిస్తా, బాదం మరియు కుంకుమ పువ్వు వేయాలి. అంతే దీన్ని ఫ్రిజ్ లో పెట్టి, అరగంట తర్వాత చల్లచల్లగా సర్వ్ చేయాలి.అంతే రుచికరమైన మ్యాంగో రబ్రి రిసిపి రెడీ.



Click it and Unblock the Notifications











