Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మహారాష్ట్ర స్పెషల్ పనీర్ తేచా..వారెవ్వా అనిపించే టేస్ట్
భారతీయ వంటకాల్లో పచ్చళ్లు,చట్నీలకు ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ మహారాష్ట్ర వంటకమైన తేచా తన ఘాటైన రుచికి పెట్టింది పేరు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా, ఆరోగ్య స్పృహ కలిగిన వారు ఈ సంప్రదాయ వంటకానికి పనీర్ జోడించి పనీర్ తేచాగా మార్చారు. ఇది నోరూరించే రుచితో పాటు శరీరానికి కావాల్సిన ప్రోటీన్లను కూడా అందిస్తుంది.
ఇది చాలా సులభంగా, తక్కువ సమయంలో తయారు చేసుకోగలిగే వంటకం. దీనిని రోటీ, చపాతీ, జొన్న రొట్టె లేదా అన్నంతో సైడ్ డిష్ గా తీసుకోవచ్చు. బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా కూడా ఓ ఇంటర్వ్యూ పందర్భంగా తాను పనీర్ తేచాని చాలా ఇష్టంగా తింటానని, తమ ఇంట్లో తరచుగా దీనిని తయారుచేసుకుంటామని తెలిపారు. మహారాష్ట్ర ఫేమస్ పనీర్ తేచా మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
పనీర్: 200 గ్రాములు
పచ్చిమిర్చి: 10-12
వెల్లుల్లి రెబ్బలు: 10-12
వేరుశెనగ గుళ్లు: 3 టేబుల్ స్పూన్లు
జీలకర్ర: 1 టీస్పూన్
కొత్తిమీర: గుప్పెడు
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
నిమ్మరసం: 1 టీస్పూన్
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో వేరుశెనగ గుళ్లను నూనె లేకుండా దోరగా వేయించుకోండి. అవి చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోండి.
-అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేయండి. ఆ వెంటనే వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి మధ్యలో చిన్న గాట్లు పెట్టి వేయండి. పచ్చిమిర్చి రంగు మారే వరకు, వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. తర్వాత దీనిని చల్లారనివ్వండి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో లేదా రోటిలో వేయించిన పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, వేరుశెనగలు, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మిక్సీలో వేస్తే మరీ మెత్తగా పేస్ట్ చేయకుండా పల్స్ మోడ్ లో తిప్పండి. తేచా ఎప్పుడూ కాస్త పలుకులుగా ఉంటేనే రుచి బాగుంటుంది.
-ఇప్పుడు పాన్ లో మరో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, చిన్న ముక్కలుగా చేసిన పనీర్ ను వేసి 2 నిమిషాలు పనీర్ పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న మిర్చి-వెల్లుల్లి పేస్ట్ (తేచా)ను పనీర్ తో కలపండి.
-సన్నని మంటపై పనీర్, మసాలా బాగా కలిసేలా 2-3 నిమిషాలు వేయించండి. చివరగా కావాలనుకుంటే కాస్త నిమ్మరసం పిండుకోవచ్చు. అంతే ఎంతో రుచికరమైన పనీర్ తేచా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications