Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
సండే స్పెషల్..నోరూరించే కేరళ స్టైల్ చికెన్ 65..రెస్టారెంట్ రుచిని మరిపించేలా
ఆదివారం వచ్చిందంటే చాలు మన ఇళ్లలో చికెన్ కూర గుమగుమలాడాల్సిందే. సాధారణంగా చికెన్ తెచ్చుకోగానే పిల్లల కోసం లేదా స్టార్టర్ కోసం మనం రెగ్యులర్ గా చికెన్ 65 చేస్తుంటాం. కానీ ఎప్పుడూ ఒకే రుచితో, అదే పద్ధతిలో చేసుకుంటే బోర్ కొడుతుంది. ఈసారి కొంచెం వెరైటీగా కేరళ స్టైల్ చికెన్ 65 ట్రై చేసి చూడండి.
మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ 65 లేదా చిల్లీ చికెన్ కంటే దీని రుచి చాలా భిన్నంగా ఉంటుంది. వేడి వేడి బిర్యానీలోకి, బగారా రైస్ లేదా ఘీ రైస్ లోకి ఇది అదిరిపోయే కాంబినేషన్. కేరళ స్టైల్ చికెన్ 65 ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
బోన్ లెస్ చికెన్: అర కిలో
చిల్లీ గార్లిక్ సాస్: 2-3 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి తరుగు: 1 టేబుల్ స్పూన్
కరివేపాకు: 2 రెమ్మలు
పచ్చిమిర్చి: 5
నూనె: వేయించడానికి సరిపడా
ఎండు మిరపకాయలు: 8
అల్లం: 1 అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు: 5
జీలకర్ర: 1 టీస్పూన్
సోంపు: ఒకటిన్నర టీస్పూన్
ధనియాలు: ఒకటిన్నర టీస్పూన్
నల్ల మిరియాలు: అర టీస్పూన్
నిమ్మరసం: 2 టేబుల్ స్పూన్లు
పెరుగు: 4 టేబుల్ స్పూన్లు
బియ్యం పిండి: 1 టేబుల్ స్పూన్
కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండి): 1 టేబుల్ స్పూన్
గరం మసాలా పొడి: 1 టీస్పూన్
గుడ్డు: 1
ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ లో ఎండు మిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, సోంపు, జీలకర్ర, ధనియాలు, నిమ్మరసం, పెరుగు వేసి మెత్తటి పేస్ట్ లా రుబ్బుకోవాలి.
-కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్లో తయారు చేసుకున్న మసాలా పేస్ట్, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. ఆ తర్వాత ఇందులో బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్ వేసి మరోసారి కలిపి కనీసం 1 గంట పాటు పక్కన పెట్టాలి.
-చికెన్ వేయించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, నానబెట్టిన చికెన్ లో ఒక గుడ్డు పగలగొట్టి వేపి బాగా పట్టేలా కలపాలి. ఇది చికెన్ క్రిస్పీగా రావడానికి సహాయపడుతుంది.
ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేశాక మంటను మీడియంలో పెట్టి చికెన్ ముక్కలను కొద్దికొద్దిగా వేసి వేయించుకోవాలి.
-ముక్కలు బంగారు రంగులోకి మారి, క్రిస్పీగా అయ్యే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు కేరళ స్టైల్ తాలింపు కోసం వేరొక పాన్ లో ఒక టీస్పూన్ నూనె వేడి చేయాలి. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, చీల్చిన పచ్చిమిర్చి, తాజా కరివేపాకు వేసి 20 సెకన్ల పాటు వేయించాక చిల్లీ గార్లిక్ సాస్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
-ఇప్పుడు వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను తాలింపులో వేయాలి. సాస్, కరివేపాకు ఫ్లేవర్ ముక్కలకు బాగా పట్టేలా 2 నిమిషాల పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
-అంతే ఎంతో రుచికరమైన, స్పైసీ కేరళ స్టైల్ చికెన్ 65 రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









