Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
లంచ్ బాక్స్ లోకి ఏం వండాలో తెలియట్లేదా? అయితే ఈ సూపర్ టేస్టీ సాంబార్ రైస్ ట్రై చేయండి!
సాంబార్ రైస్ అనేది దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు వారి ఇళ్లల్లో, తమిళనాడులో అత్యంత ప్రజాదరణ పొందిన ఒక సంప్రదాయ వంటకం. దీనిని కేవలం ఒక ఆహార పదార్థంగా కాకుండా, ఒక కంఫర్ట్ ఫుడ్ గా పరిగణిస్తారు.
బియ్యం, కందిపప్పు, రకరకాల కూరగాయలు, సుగంధ ద్రవ్యాల కలయికతో తయారయ్యే ఈ వంటకం రుచిలో అద్భుతంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. సాంబార్ రైస్ ని సూపర్ టేస్టీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
-బియ్యం
-కందిపప్పు
-చింతపండు
-నెయ్యి,నూనె
-నీళ్లు
-ఉప్పు
-ఉల్లిపాయ
-టమాటో
-క్యారెట్
-బంగాళాదుంప
-పచ్చిమిర్చి
-సాంబార్ పొడి
-పసుపు
-కారం
-ఆవాలు
-జీలకర్ర
-ఎండుమిర్చి
-కరివేపాకు
-ఇంగువ
-కొత్తిమీర
-జీడిపప్పు
-బఠాణీ
తయారీ విధానం
-ముందుగా కుక్కర్ లో ఒక కప్పు బియ్యం, 1 కప్పు కందిపప్పు వేసి నీళ్లు పోసి కడిగిన తర్వాత అందులో 5-6 కప్పుల నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మీడియం మంట మీద 3 విజిల్స్ రానివ్వాలి.
-ఈలోగా ఒక చిన్న గిన్నెలో చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి అది మునిగేంతవరకు నీరు పోసి చింతపండుని నాననివ్వాలి.
-తర్వాత కూరగాయ ముక్కలన్నీ(క్యారెట్,బంగాళదుంప, పచ్చి బఠాణీలు ఒక కప్పు వరకు తీసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత కుక్కర్ లో ఉడికిన బియ్యం పప్పు మిశ్రమాన్ని గరిటతో జస్ట్ ఒకసారి కలిపి పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ మలో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేశాక అందులో 1 టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర వేసి ఇవి వేగిన తర్వాత ఇందులో కచ్చాపచ్చాగ దంచిన 5 వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి.
-వెల్లుల్లి లైట్ గా వేగిన తర్వాత అదే పాన్ లో 1 ఉల్లిపాయ ముక్కలు (సాంబార్ ఉల్లిపాయ ముక్కలు అయినా), 3 పచ్చమిరపకాయల చీలికలు, చిటికెడు ఇంగువ వేసుకొని వేయించుకోవాలి.
-ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అందులో 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించుకున్నాక 1 మీడియం సైజు టమాటో పెద్ద ముక్కలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలన్నీ వేసి, అర టీస్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మీడియం మంట మీద వేయించుకోవాలి.
-కూరగాయల ముక్కలన్నీ వేగిన తర్వాత అందులో 2 టీస్పూన్ల కారం వేసి కలిపాక ఇందులో చింతపండు రసం(మరీ ఎక్కువగా వద్దు), రెండున్నర గ్లాసుల నీళ్లు కూడా పోసి కలిపి ఇందులో 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని మూతపెట్టి 5 నిమిషాలు ఉడికించాలి.
-5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న బియ్యం పప్పు మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి.కలిపేటప్పుడు మంటను తక్కువలో ఉంచాలి.
-బాగా కలుపుకున్నాక మళ్లీ మూతపెట్టి తక్కువ మంట మీద 3 నిమిషాలు ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆపేయాలి. ఇప్పుడు అందులో కొత్తిమీర తరుగు, నేతిలో వేయించిన ఎండుమిర్చి,కరివేపాకు,జీడిపప్పు వేసి కలుపుకోండి.
-అంతే సూపర్ టేస్టీ సాంబార్ రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications