Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.!
ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా పాలకూర.. ఇందులో ఉండే పోషక విలువలు సాధారణమైనవి కావు. యాంటీఆక్సిడెంట్లతో పాటు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి, రక్తహీనత సమస్య ఉన్నవారికి దివ్య ఔషధంలా పనిచేస్తుంది. అయితే పాలకూరను ఎప్పుడూ చేసుకునేలా సింపుల్‌గా కాకుండా ఇలా వెరైటీగా చేసుకోండి.. రుచికి రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం సొంతమవుతుంది.

పాలకూరలో విటమిన్లు ఏ, సీ, కే, కాల్షియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. పాలకూరను పప్పు లేదా కూర రూపంలో వారంలో ఒకటి, రెండు సార్లు తీసుకోవడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. రక్తహీనత సమస్యను నివారిస్తుంది. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం సొంతమయ్యేలా పాలకూర ఉల్లిపాయతో ఇలా వినూత్నంగా కర్రీ చేసుకోండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే..
పాలకూర ఉల్లిపాయ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు
పాలకూర- రెండు మీడియం సైజు కట్టలు
మినప్పప్పు- టీస్పూన్
ధనియాలు- టీస్పూన్
శనగపప్పు- టీస్పూన్
జీలకర్ర- టీస్పూన్
ఎండుమిర్చి- ఆరు లేదా 7(మీరు తినే ఘాటుకి సరిపడా)
ఉల్లిపాయ- మూడు మీడియం సైజు
ఉప్పు- సరిపడా
కారం- టీస్పూన్
చింతపండు- నిమ్మకాయ సైజు
వెల్లుల్లి- ఆరు
పసుపు- పావు టీస్పూన్
నూనె- రెండు టేబుల్ స్పూన్లు
పాలకూర ఉల్లిపాయ కూర తయారీ విధానం
ముందుగా పాలకూర చిన్నగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు మొత్తం పోయేలా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనే వేసి ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసి వేగాక వీటిని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. సరిపడా ఉప్పు, చింతపండు వేసి వేగిన తర్వాత ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి మిశ్రమం, కారంతో కలిపి రోట్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

ఇప్పుడు అదే పాన్‌లో మిగిలిన నూనె వేసి వేడయ్యాక కచ్చాపచ్చాగ దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. పసుపు వేసి వేగాక పాలకూరను వేసి కలుపుకోవాలి. నీరు మొత్తం ఇంకిపోయేవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్‌ను వేసి మరోసారి కలుపుకొని అడుగంటే వరకు కూరను ఉడికించుకోవాలి. అంతే రుచికరమైన, ఆరోగ్యకరమైన పాలకూర, ఉల్లిపాయ కూర రెడీ. వేడి వేడి అన్నంలో ఈ కూరతో పాటు నెయ్యి కలుపుకొని తింటే ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టరు.
పాలకూరలోని విటమిన్ ఏ, లుటీన్, జియాజాంథిన్ వంటి యాంటీఆక్సిడెంట్ల ద్వారా కంటి చూపు మెరుగుపడుతుంది. కంటిశుక్లం వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. విటమిన్ కె ఎముకలను దృఢపరుస్తుంది. ఫోలేట్, మెగ్నీషియం గుండె జబ్బులను నివారించి, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియ సరిగా ఉండేలా చేస్తుంది. తక్కువ మొత్తంలో కేలరీలు ఉండటం వల్ల బరువును అదుపులో ఉంచుతుంది.
పాలకూరలోని 13 రకాల యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలను అడ్డుకుని వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. అయితే ఇందులో ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి. కిడ్నీలో రాళ్ల సమస్య, కీళ్ల నొప్పులు ఉన్నవారు డాక్టర్ల సలహా మేరకు తీసుకోవడం ఉత్తమం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications