Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. శ్రీరామ నవమి స్పెషల్ పానకం, వడపప్పు ఎలా చేసుకోవాలంటే..
భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలలో శ్రీరామ నవమి ఒకటి. ఈ ఏడాది మార్చి 26న శ్రీరామ నవమి జరుపుకుంటారు. వసంత రుతువులో, చైత్ర శుద్ధ నవమి రోజున మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముని జన్మదినాన్ని, అలాగే సీతారాముల కల్యాణోత్సవాన్ని దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున శ్రీరామచంద్రుడికి నైవేద్యంగా ముఖ్యంగా సమర్పించేది వడపప్పు, పానకం చలిమిడి.
హిందూ పండుగలు కేవలం ఆధ్యాత్మికతకే కాదు, ఆరోగ్యానికి, రుతువుల మార్పులకు కూడా ముడిపడి ఉంటాయి. శ్రీరామ నవమి నాటికి ఎండాకాలం తీవ్రరూపం దాలుస్తుంది. ఎండ వేడిమి నుంచి శరీరాన్ని రక్షించుకోవడానికి మన పూర్వీకులు ఈ పానకం, వడపప్పులను ప్రసాదంగా నిర్ణయించారు. ఇవి కేవలం ప్రసాదాలు మాత్రమే కావు, వేసవి తాపాన్ని తీర్చే దివ్యౌషధాలు. అచ్చం గుడిలో చేసే రుచితో వడపప్పు, పానకం ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

పానకాన్ని శ్రీరాముని అమృతం అని కూడా అంటారు. ఇది ఒక అద్భుతమైన సాంప్రదాయక ఎనర్జీ డ్రింక్. గుడిలో ఇచ్చే పానకం చాలా ప్రత్యేకమైన రుచిని సువాసనను కలిగి ఉంటుంది. దానికి కారణం అందులో వాడే పచ్చ కర్పూరం,శొంఠి.
పానకం తయారీకి కావాల్సిన పదార్థాలు
నీళ్లు - 4 కప్పులు
తురిమిన బెల్లం - 1 కప్పు
మిరియాల పొడి - 1 టీస్పూన్
యాలకుల పొడి - అర టీస్పూన్
శొంఠి పొడి - పావు టీస్పూన్
పచ్చ కర్పూరం - చిటికెడు
తులసి ఆకులు - 10-12
నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
పానకం తయారీ విధానం
-ముందుగా ఒక శుభ్రమైన గిన్నెలో 4 కప్పుల నీళ్లు తీసుకోవాలి. మట్టి కుండలో నీళ్లు తీసుకుంటే రుచితో పాటు చల్లదనం కూడా వస్తుంది. ఆ నీటిలో తురిమిన బెల్లం వేసి, బెల్లం పూర్తిగా కరిగేలా బాగా కలపాలి. బెల్లంలో నలకలు, ఇసుక వంటివి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ బెల్లం నీటిని ఒక సన్నని జల్లెడతో లేదా కాటన్ వస్త్రంతో వడకట్టుకోవాలి.
-ఇప్పుడు ఆ బెల్లం నీటిలో మిరియాల పొడి, యాలకుల పొడి, శొంఠి పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత చాలా తక్కువ మోతాదులో (ఒక ఆవగింజ అంత) పచ్చ కర్పూరాన్ని చేతితో నలిపి వేయాలి. పచ్చ కర్పూరం ఎక్కువగా వేస్తే చేదు వస్తుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా చిటికెడు మాత్రమే వేయాలి.
-చివరగా, శుభ్రంగా కడిగిన తులసి ఆకులను చేతితో తుంచి అందులో వేయాలి. కావాలనుకుంటే కాస్త నిమ్మరసం పిండుకోవచ్చు. అంతే, దేవుడికి నైవేద్యంగా సమర్పించడానికి అచ్చం గుడిలో చేసే అద్భుతమైన పానకం రెడీ.

వడపప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు
పసుపు రంగు పెసరపప్పు- 1 కప్పు
పచ్చిమిర్చి - 1
అల్లం తరుగు - అర టీస్పూన్
పచ్చి కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు
పచ్చి మామిడికాయ ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
వడపప్పు తయారీ విధానం
-ముందుగా ఒక కప్పు పెసరపప్పును తీసుకొని, రెండు మూడు సార్లు నీటితో శుభ్రంగా కడగాలి.
-కడిగిన పెసరపప్పులో తగినన్ని నీళ్లు పోసి సుమారు గంట లేదా రెండు గంటల పాటు నానబెట్టాలి.
-పప్పు బాగా నానిన తర్వాత అందులోని నీటిని పూర్తిగా వడకట్టేయాలి.
-నీరు వడకట్టిన పెసరపప్పును ఒక గిన్నెలోకి తీసుకొని, అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం తరుగు, పచ్చి కొబ్బరి తురుము, మామిడికాయ ముక్కలు వేయాలి. రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసి, అన్ని పదార్థాలు పప్పుకు పట్టేలా సున్నితంగా కలపాలి. పప్పు మెత్తగా కాకుండా చూసుకోవాలి.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించుకోవాలి. ఎంతో కమ్మగా, చల్లగా ఉండే వడపప్పు నైవేద్యానికి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications