Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
శ్రీకాకుళం స్పెషల్ రెసిపి..ఇప్పటివరకు ఇలాంటి అద్భుతమైన వంటకం తిని ఉండరు,ఎలా చేయాలంటే
వంటలు కొన్ని టేస్టీగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి మేలు చేయవు. మరికొన్ని వంటకాలు ఆరోగ్యానికి మేలు చేపేవి అయినప్పటికీ టేస్టీగా ఉండవు. కేవలం కొన్ని మాత్రమే టేస్టీగా ఉండి ఆరోగ్యానికి మేలు చేసేవిగా ఉంటాయి. అలాంటివాటిల్లో శ్రీకాకుళం స్పెషల్ గూన చారు ఒకటి. ఇది ఒక సాంప్రదాయ వంటకం. ఇది శ్రీకాకుళం జిల్లాలో బాగా ప్రాచుర్యం పొందింది. దీనిని వివిధ కూరగాయలు, చింతపండు పులుసు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. శ్రీకాకుళంకి చెందిన గృహిణి గంప అరుణ..గూన చారు ఎలా తయారుచేసుకోవాలో బోల్డ్ స్కై తెలుగుకి వివరించారు.
గూన చారు తయారీకి కావలసిన పదార్థాలు
పనస పొట్టు: 1 కప్పు
మునగకాయలు: 2
వంకాయలు: 2
అరటికాయ: 1
చింతపండు: 1 చిన్న నిమ్మకాయ సైజు అంత
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 2-3
కరివేపాకు: కొన్ని రెబ్బలు
ఆవాలు: 1/2 టీస్పూన్
జీలకర్ర: 1/2 టీస్పూన్
మెంతులు: 1/4 టీస్పూన్
పసుపు: 1/4 టీస్పూన్
కారం: 1 టీస్పూన్
ఉప్పు: తగినంత
నూనె: 2 టేబుల్ స్పూన్లు
బెల్లం: చిన్న ముక్క
బియ్యం పిండి: 2 టేబుల్ స్పూన్లు

గూన చారు తయారీ విధానం
-మొదటగా చింతపండును నానబెట్టి పులుసు తీయాలి.
-తర్వాత కూరగాయలను ముక్కలుగా కట్ చేయాలి.
-ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
-తర్వాత కూరగాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి.
-అందులోనే చింతపండు పులుసు, బెల్లం వేసి కూరగాయలు ఉడికే వరకు ఉడికించాలి.
-బియ్యం పిండిని కొద్దిగా నీటిలో కలిపి చారులో వేసి బాగా కలపాలి.
-చారు చిక్కబడే వరకు తక్కువ మంట మీద ఉడికించాలి.
-వేడి వేడి అన్నంలో గూన చారు వేసుకుని తింటే మాటల్లో వర్ణించలేని రుచి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
