Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
పారేసే తొక్కలతో అదిరిపోయే రుచి.. బీహారీ స్టైల్ పచ్చి అరటికాయ తొక్కల పచ్చడి!
సాధారణంగా పచ్చి అరటికాయలతో మనం కూర, బజ్జీలు లేదా ఫ్రై చేసుకుని, ఆ తర్వాత వాటి తొక్కలను ఏమాత్రం ఆలోచించకుండా చెత్తబుట్టలో పారేస్తుంటాం. కానీ ఆ తొక్కలతో అమృతమంత రుచిగా ఉండే పచ్చడి చేయవచ్చని మీకు తెలుసా? బీహార్ రాష్ట్రంలో పచ్చి అరటికాయ తొక్కల పచ్చడి చాలా ఫేమస్.
ఇది కేవలం రుచికరమైనదే కాదు, ఎన్నో పోషకాలను కూడా కలిగి ఉంటుంది. ఒకసారి ఈ చట్నీ రుచి చూశారంటే, ఇకపై ఎప్పుడూ అరటికాయ తొక్కలను పారేయరు. బీహారీ స్టైల్ పచ్చి అరటికాయ తొక్కల పచ్చడి ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

పచ్చి అరటికాయ తొక్కల పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
పచ్చి అరటికాయలు - 2
ఉల్లిపాయ - 1
వెల్లుల్లి రెబ్బలు - 4 నుండి 5
అల్లం - 1 అంగుళం ముక్క
పచ్చిమిర్చి - 2
ఎండుమిర్చి - 1
జీలకర్ర - 1 టీస్పూన్
ఆవ నూనె - 2 లేదా 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - గుప్పెడు
నిమ్మకాయ - 1
పచ్చి ఆవ నూనె - అర టీస్పూన్
పచ్చి అరటికాయ తొక్కల పచ్చడి తయారీ విధానం
-ముందుగా పచ్చి అరటికాయలను శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్ లో వేసి తగినన్ని నీళ్లు పోయాలి. రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. కుక్కర్ చల్లారిన తర్వాత అరటికాయలను బయటకు తీసి, లోపలి గుజ్జును, పై తొక్కను వేరు చేయాలి.
-ఇప్పుడు వేరు చేసిన అరటికాయ తొక్కలను పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఆ తొక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆవ నూనె వేసి వేడి చేయాలి. బీహారీ వంటకాల్లో ఆవ నూనె అసలైన రుచిని ఇస్తుంది.
-నూనె వేడెక్కాక అందులో జీలకర్ర, ఎండుమిర్చి వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి ముక్కలను వేసి పచ్చివాసన పోయే వరకు దోరగా వేయించాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న అరటికాయ తొక్కల ముక్కలను కడాయిలో వేయాలి. రుచికి సరిపడా ఉప్పు చల్లి, ఒక ఐదు నిమిషాల పాటు సన్నటి మంటపై బాగా మగ్గనివ్వాలి.
-అన్నీ బాగా వేగిపోయిన తర్వాత, పైన గుప్పెడు తాజా కొత్తిమీర తురుమును చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు.
-రుబ్బిన చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. బీహారీ టచ్ కోసం పైన కొద్దిగా పచ్చి ఆవ నూనెను వేసి బాగా కలుపుకోవాలి. అంతే కమ్మని పచ్చి అరటి తొక్కల చట్నీ రెడీ.
-వేడి వేడి అన్నంలోకి, రోటీల్లోకి లేదా పరాఠాల్లోకి ఈ చట్నీ అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications