Latest Updates
-
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
Gold Rates in India 100 grams Dropped RS 31,100 know 24k 22k 18k Yellow Metal prices on March 4 -
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే! -
ఒకే రకమైన మందులు.. వేర్వేరు ఫలితాలు..లివర్ డ్యామేజ్ వెనుక ఉన్న రహస్యం ఇదే! -
Veteran Congress Leader KP Unnikrishnan Dies in Kozhikode: Remembering the Architect of Gulf Evacuation -
హ్యాపీ హోలీ 2026..మీ బంధుమిత్రులకు పంపడానికి బెస్ట్ హోలీ విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇవే! -
ఈ హోలీకి అదిరిపోయే స్నాక్..అతిథులను మెప్పించే కరకరలాడే హెల్దీ రైస్ కుర్కురే..ఎలా చేసుకోవాలంటే.. -
హోలీ స్పెషల్..తాగేకొద్దీ తాగాలనిపించే చల్లని థాండాయ్..ఎలా చేసుకోవాలంటే.. -
వేసవి తాపాన్ని క్షణాల్లో తగ్గించే అద్భుతమైన సోంపు షర్బత్..ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు!
హోలీ లాంటి పండుగల సమయంలో కానీ, ఇంట్లోకి హఠాత్తుగా అతిథులు వచ్చినప్పుడు కానీ, లేదా సాయంత్రం వేళ పిల్లలు స్కూల్ నుండి ఆకలిగా ఇంటికి వచ్చినప్పుడు కానీ... వారికి ఏదైనా ప్రత్యేకంగా చేసి పెట్టాలనుకుంటే ఈ భేల్ పూరీ ఒక అద్భుతమైన ఆప్షన్. అయితే బయట దొరికే భేల్ పూరీని ఇంట్లో తయారు చేయడం చాలా కష్టమని అనుకుంటున్నారా?
ఎప్పుడైనా మీరే స్వయంగా ఇంట్లో భేల్ పూరీ చేయడానికి ప్రయత్నించారా? ఇంట్లోనే ఎంతో సులభంగా, అచ్చం బయట బండి మీద దొరికే రుచితో భేల్ పూరీని చిటికెలో తయారు చేసుకోవచ్చు. దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే ఈ అద్భుతమైన స్నాక్ ని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
మరమరాలు (బొరుగులు లేదా పఫ్డ్ రైస్)- అర కిలో
వేరుశెనగ గుళ్లు (పల్లీలు) - ఒక కప్పు
సన్న కారప్పూస (సేవ్) - అర కప్పు
పుదీనా, పచ్చిమిర్చి చట్నీ- 2 టీస్పూన్లు
స్వీట్ చట్నీ (చింతపండు, ఖర్జూర చట్నీ) - 2 టీస్పూన్లు
నిమ్మకాయ - 1
కొత్తిమీర - తగినంత
చాట్ మసాలా - రుచికి సరిపడా
ఉప్పు - రుచికి సరిపడా
కారాబూందీ - కొద్దిగా
పసుపు - చిటికెడు
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి పాన్ లేదా కడాయి పెట్టుకోండి. అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక వేరుశెనగ గుళ్లను దోరగా వేయించుకోండి. అవి కాస్త రంగు మారాక అందులో చిటికెడు పసుపు వేసి, వెంటనే అర కిలో మరమరాలను కూడా వేసి సన్నటి మంటపై బాగా వేయించాలి.
-ఇలా మరమరాలను నూనెలో కొద్దిగా వేయించడం వల్ల అవి త్వరగా మెత్తబడకుండా ఎక్కువసేపు కరకరలాడుతూ (క్రిస్పీగా) ఉంటాయి.
-మరమరాలు చక్కగా వేగి, పూర్తిగా చల్లారిన తర్వాత... వాటిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అందులో గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, కారప్పూస, రుచికి సరిపడా ఉప్పు, చాట్ మసాలా వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక పెద్ద నిమ్మకాయ రసాన్ని పూర్తిగా పిండుకోండి. నిమ్మరసం భేల్ పూరీకి అద్భుతమైన పుల్లటి రుచిని ఇస్తుంది. అన్నీ సమపాళ్లలో కలిసేలా గరిటెతో లేదా చేత్తో బాగా కలపాలి.
-భేల్ పూరీ బేస్ సిద్ధమైన తర్వాత దానిపై అలంకరణ కోసం సన్నగా తరిగిన పచ్చటి కొత్తిమీర, కొద్దిగా కారాబూందీని చల్లుకోవాలి. ఇవి భేల్ పూరీకి అదనపు క్రంచ్ ని ఇస్తాయి.
-అచ్చం ముంబై స్ట్రీట్ స్టైల్ భేల్ పూరీ రుచి మీకు కావాలంటే... ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, అలాగే ముందుగా ఉడకబెట్టి చిన్న ముక్కలుగా కోసుకున్న బంగాళాదుంపలను కూడా కలుపుకోవచ్చు.
-అంతే కేవలం ఐదు పది నిమిషాల వ్యవధిలోనే మీ నోరూరించే స్పైసీ, టాంగీ భేల్ పూరీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












