Latest Updates
-
అమెరికాలో చీప్,భారత్ లో కాస్ట్లీ : ఇండియాలోనే తయారవుతున్నా..ఐఫోన్ల ధరలు ఎందుకు మండిపోతున్నాయి? -
ఉద్యోగులకు అలర్ట్..మీ గుండెను దెబ్బతీస్తున్న 4 ప్రధాన కారణాలివే! -
స్వీట్ షాప్ స్టైల్ మలై బర్ఫీ..ఈ సింపుల్ రెసిపీ తెలిస్తే ఇకపై బయట కొనరు! -
అంగారకుడి నీచ సంచారం.. ఈ 4 రాశుల వారు కళ్లు తెరిచి ఉండకపోతే పక్కాగా నష్టపోతారు! -
పెళ్లిళ్లలో ఇది లేకుండా భోజనం పూర్తి కాదు.. నోరూరించే ఆంధ్రా స్టైల్ గోంగూర శనగపప్పు పులుసు.! -
షాపులో దొరికే కల్తీ బెల్లం వద్దు.. ఇంట్లోనే స్వచ్ఛమైన బెల్లం చేసుకోండిలా! -
దానిమ్మ గింజలు ఏ రంగులో ఉంటే ఎక్కువ పోషకాలు లభిస్తాయో తెలుసా.. USDA డేటా ఇదే.! -
చిట్టి గణేశుడిని ఇంట్లోకి తెస్తున్నారా.. సంప్రదాయం ప్రకారం ఎన్ని రోజులు పూజించాలో తెలుసా.? -
కార్పొరేట్ ఉద్యోగులే ఆశ్చర్యపోయేలా పనిమనిషి జీ'వి'తం.. ఆమె సేవింగ్స్ ప్లానింగ్‌కి హ్యాట్సఫ్.! -
ఆరోగ్య సిరి, రుచుల గని..వేళ్లు కొరుక్కునే మునగాకు ఇడ్లీ తయారీ విధానం ఇదే!
గుత్తి వంకాయ కర్రీ అంటే ఎర్రగానే ఉండాలా.. పచ్చికారంతో ఇలా చేస్తే దానికి మించిన రుచి ఉండదు.!
సాధారణంగా వంకాయలు అంటే గుత్తి వంకాయ మసాలా, వంకాయ ఫ్రై, పులుసు ఇలా చాలా రకాలు గుర్తొస్తాయి. అయితే ఇవన్నీ ఎక్కువగా ఎర్ర కారంతోనే చేస్తాం. కానీ ఎప్పుడైనా పచ్చి కారంతో గుత్తి వంకాయ మసాలా కర్రీ చేశారా.. ఈ సారి మీ ఇంటిల్లిపాదికీ నచ్చేలా పచ్చని వంకాయలతో ఇలా గుత్తి వంకాయ మసాలా చేసి చూడండి ఆ రుచిని జన్మలో మరిచిపోలేరు.

గుత్తి వంకాయ పచ్చి కారం మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు
పచ్చిమిరపకాయలు- 10 నుంచి 12 (లేదా మీరు తినే కారానికి సరిపడా)
వెల్లుల్లి- 10 లేదా 15 రెబ్బలు
అల్లం- చిన్న ముక్క
వేరుశనగ పల్లీలు- నాలుగు టేబుల్ స్పూన్లు
తెల్ల నువ్వులు- రెండు టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క- ఒకటి
ఏలకులు- నాలుగు
లవంగాలు- నాలుగు
కొత్తిమీర- కొద్దిగా
ధనియాల పొడి- రెండు టీస్పూన్లు
పసుపు- పావు టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
పచ్చని వంకాయలు- పావు కేజీ
నూనె- రెండు టేబుల్ స్పూన్లు
ఆవాలు, జీలకర్ర- టీస్పూన్
పచ్చిమిర్చి- రెండు
కరివేపాకు- రెండు రెబ్బలు
ఉల్లిపాయ- ఒకటి
చింతపండు- నిమ్మకాయ సైజు
గుత్తి వంకాయ పచ్చి కారం మసాలా కర్రీ తయారీ విధానం
ముందుగా పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ముక్కలను వేసి కాసేపు వేయించుకోవాలి. వాటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలో పల్లీలు, నువ్వులు వేసి వేగాక పచ్చిమిర్చితో పాటు కలిపి కొత్తిమీర, దాల్చిన చెక్క, ఏలకులు, లవంగాలు వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్‌లో పసుపు, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకొని ఈ స్టఫ్‌ను పక్కన పెట్టుకోవాలి.

వంకాయలను తీసుకుని వాటిని కొద్దిగా కట్ చేసుకోవాలి. వంకాయలను నాలుగు భాగాలుగా గాట్లు పెట్టుకోవాలి. ఇలాగే అన్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని ఉప్పు నీళ్లలో వేసి కాసేపు కడగాలి. తర్వాత పచ్చిమిర్చి స్టఫ్‌ను వంకాయల మధ్యలో నింపుకోవాలి. చింతపండును కడిగి నానబెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్‌పైన పాన్ పెట్టి నూనె పోసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్ రంగు మారి దోరగా వేగిన తర్వాత అందులో వంకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి.
వంకాయలు బాగా మగ్గిన తర్వాత మిగిలిన స్టఫ్‌ను వేసి కలుపుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. అడుగంటుతూ నూనె పైకి తేలిన తర్వాత చింతపండు రసం వేసి కాసేపు ఉడకనివ్వాలి. అవసరమైతే కాసిన్ని నీళ్లు పోసుకోవచ్చు. బాగా ఉడికి నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.
ఈ వంకాయ పచ్చి కారం మసాలా కర్రీని ఇతర చిన్న వంకాయలతో కూడా చేసుకోవచ్చు. ఎంతో రుచికరంగా ఉండే ఈ స్పెషల్ రెసిపీని వేడి వేడి అన్నం లేదా చపాతీలోకి సర్వ్ చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
