Latest Updates
-
బంపర్ ఆఫర్: ఫ్రీగా ఫిన్ లాండ్ వెళ్లే ఛాన్స్..ఒక్క రూపాయి లేకుండా 7 రోజుల ట్రిప్..పూర్తి వివరాలు చూడండి.. -
Weekly rasi phalalu (22 నుండి 28 మార్చి): ఈ రాశుల వారికి అదృష్టం వరించబోతోంది, మీ రాశి ఉందేమో చూడండి! -
ఆరోగ్యానికి అమృతం లాంటి నల్ల నువ్వుల లడ్డూ..ఇలా చేసి రోజుకొకటి తింటే జుట్టు రాలడం, PCOD పరార్! -
Today rasi phalalu (22.03.26): ఆదివారం నాడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
పనీర్ లేకుండానే పాలక్ పనీర్!..ఈ 2.0 రెసిపీ చూస్తే వెంటనే వండేస్తారు! -
అబ్బాయిలు vs అమ్మాయిలు..ప్రేమ విషయంలో ఎవరు ఎక్కువ సీరియస్ గా ఉంటారు? -
పర్ఫెక్ట్ అల్లం టీ తయారీకి సీక్రెట్ ఇదే.. ఒక్కసారి ఇలా ట్రై చేయండి! -
నోరూరించే చెట్టినాడ్ చికెన్.. తింటుంటే వావ్ అనాల్సిందే! -
నోరూరించే భాయ్ స్టైల్ చికెన్ బిర్యానీ.. మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
కాఫీ, టీలు ఎక్కువ తాగుతున్నారా? అయితే ఈ నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఘుమఘుమలాడే మంగళూరు చికెన్ సుక్కా.. ఒక్కసారి వండితే ఇంట్లో వాళ్లు మళ్లీ మళ్లీ కావాలంటారు!
ఆదివారం వస్తుందంటే చాలు మాంసాహారుల ఇళ్లలో చికెన్ వంటకాలు ఘుమఘుమలాడాల్సిందే. అయితే ఎప్పుడూ ఒకేలాంటి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై తిని బోర్ కొట్టిందా? అయితే ఈ సారి కాస్త భిన్నంగా, నోటికి భలే రుచిగా అనిపించే మంగళూరు స్పెషల్ చికెన్ సుక్కా ట్రై చేయండి.
చికెన్ సుక్కా అంటే కేవలం సాధారణ ఫ్రై మాత్రమే కాదు.. అదొక అద్భుతమైన మసాలాల కలయిక. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడకుండా తాజా మసాలా దినుసులను నేరుగా వేయించి, దంచి వేయడం వల్లే దీనికి ఆ అథెంటిక్ రుచి వస్తుంది. నీరు దోసె, బియ్యం రొట్టె లేదా వేడి వేడి అన్నంలోకి ఈ సుక్కా కలుపుకుని తింటే ఆ మజానే వేరు.
మంగళూరు చికెన్ సుక్కా తయారీకి కావలసిన పదార్థాలు
శుభ్రం చేసిన చికెన్ - 1 కిలో
ఎండు మిరపకాయలు - 20
ధనియాలు - 2 స్పూన్లు
జీలకర్ర - 1 స్పూన్
మెంతులు - అర టీస్పూన్
లవంగాలు, యాలకులు - తగినన్ని
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
చింతపండు - చిన్న నిమ్మకాయ సైజు అంత
వెల్లుల్లి రెబ్బలు - 12
ఉల్లిపాయలు, టొమాటో, కరివేపాకు - తగినంత
నెయ్యి - సరిపడా
పసుపు, ఉప్పు - రుచికి తగినంత
మంగళూరు చికెన్ సుక్కా తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేయాలి. అందులో ఎండు మిరపకాయలు, ధనియాలను వేసి కమ్మటి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఇవి చల్లారాక పసుపు, నానబెట్టిన చింతపండు జతచేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో మళ్లీ కొద్దిగా నెయ్యి వేడి చేసి.. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. వీటిని విడిగా గ్రైండ్ చేసుకోవాలి. సుక్కాకు అసలైన ఘాటు, రుచిని ఇచ్చేది ఈ మసాలాయే.
-అదే పాన్ లో కొబ్బరి తురుమును వేసి, మాడిపోకుండా లేత బంగారు రంగులోకి వచ్చేంత వరకు సన్నని మంటపై వేయించి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు మందపాటి కడాయి తీసుకుని నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో ఉల్లిపాయ, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. ఆ తర్వాత చికెన్ ముక్కలను వేసి కొద్దిసేపు నెయ్యిలో వేగనివ్వాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసిన మిరప-ధనియాల పేస్ట్ (మొదటి మసాలా) వేసి ముక్కలకు పట్టించాలి. తగినంత ఉప్పు, కొద్దిగా నీరు పోసి మూత పెట్టి ఉడికించాలి.
-చికెన్ ముప్పావు వంతు ఉడికిన తర్వాత, రెండవ మసాలా (వెల్లుల్లి మిశ్రమం) అందులో కలపాలి. కూరలోని నీరంతా ఆవిరైపోయి ముక్కలు దగ్గర పడుతున్న సమయంలో ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుము చల్లి ఐదు నిమిషాల పాటు సన్నని మంటపై ఉంచి దించేయాలి.
-అంతే నోరూరించే చికెన్ సుక్కా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












