Latest Updates
-
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.!
సండే స్పెషల్ గా తమిళనాడు ఫేమస్ ముట్టా ఇడ్లీ..10 నిమిషాల్లో ఈ హై ప్రొటీన్ బ్రేక్ ఫాస్ట్ ఎలా చేయాలంటే..
ఆరోగ్యంపై శ్రద్ధ చూపే వారికి, రోజూ జిమ్ లేదా వర్కవుట్స్ చేసే ఫిట్ నెస్ ప్రియులకు ఎప్పుడూ ఒకటే సందేహం ఉంటుంది..రుచిగా ఉంటూనే, శరీరానికి కావాల్సినంత ప్రొటీన్ ఇచ్చే బ్రేక్ ఫాస్ట్ ఏం తినాలి? అని. ఉదయాన్నే రోజూ ఉడకబెట్టిన గుడ్లు లేదా ఆమ్లెట్ తినాలంటే బోర్ కొడుతుంది. అలాగే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే రెగ్యులర్ ఇడ్లీలు తినడానికి డైట్ ఒప్పుకోదు. అలాంటి వారందరికీ ఒక అద్భుతమైన, రుచికరమైన ప్రత్యామ్నాయమే తమిళనాడు స్పెషల్ ముట్టా ఇడ్లీ.

ముట్టా అంటే తెలుగులో గుడ్డు అని అర్థం. ఇది కడుపుకు చాలా తేలికగా ఉంటుంది, పుష్కలమైన పోషకాలను అందిస్తుంది, తిన్న తర్వాత కడుపు నిండిన సంతృప్తిని ఇస్తుంది. కోడి గుడ్లు, పనీర్ కాంబినేషన్ తో చేసే ఈ రెసిపీ మీ ఫిట్ నెస్ లక్ష్యాలను చేరుకోవడంలో సూపర్ ఫుడ్ లా పనిచేస్తుంది.
పనీర్ ఎగ్ ఇడ్లీ(ముట్టా ఇడ్లీ) తయారీకి కావలసిన పదార్థాల
కోడి గుడ్లు - 3
తురిమిన పనీర్ -అర కప్పు
పచ్చికొబ్బరి తురుము - పావు కప్పు
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 1
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - చిటికెడు

పనీర్ ఎగ్ ఇడ్లీ(ముట్టా ఇడ్లీ) తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో మూడు కోడి గుడ్లను పగలగొట్టి బాగా గిలక్కొట్టాలి.
-ఇప్పుడు ఆ గుడ్డు మిశ్రమంలో ముందుగా తురిమి పెట్టుకున్న పనీర్, పచ్చికొబ్బరి తురుము, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు వేసి అన్ని పదార్థాలు గుడ్డు మిశ్రమంలో బాగా కలిసేలా స్పూన్ లేదా విస్కర్ తో కలపాలి.
-ఇప్పుడు ఇడ్లీ పాత్రను తీసుకుని, ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసి కలుపుకున్న కోడిగుడ్ల మిశ్రమాన్ని ఇడ్లీల మాదిరిగా పోయాలి. ఇడ్లీ పాత్రను స్టవ్ మీద పెట్టి, మూతపెట్టి సుమారు 10 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి.
-అంతే వేడి వేడి, నోరూరించే ప్రొటీన్ ముట్టా ఇడ్లీ రెడీ. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఈ ముట్టా ఇడ్లీని పల్లీ చట్నీ లేదా కొత్తిమీర చట్నీతో తింటే..రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
-కోడి గుడ్లలో సహజసిద్ధమైన ప్రొటీన్ ఉంటుంది. దీనికి పనీర్ తోడవడంతో కండరాల రికవరీకి, పెరుగుదలకు ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో వాడిన పచ్చి కొబ్బరి శరీరానికి అవసరమైన మంచి కొవ్వులను అందిస్తుంది. ఇది రోజంతా మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. ఇందులో నూనె వాడకం లేదు. ఆవిరి మీద ఉడికించడం వల్ల పోషకాలు ఏమాత్రం తగ్గవు, పైగా కడుపుకు చాలా తేలికగా ఉంటుంది.
-పనీర్, గుడ్లు నెమ్మదిగా జీర్ణమవుతాయి, కాబట్టి త్వరగా ఆకలి వేయదు. ఇది బరువు తగ్గాలనుకునే వారికిచాలా మంచిది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications