Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
10 నిమిషాల్లో రెడీ సూపర్ హెల్తీ ఫుడ్..పాలకూర చెన్నా ఘీ రైస్..ఎలా చేసుకోవాలంటే
ఎలాంటి మసాలాలు వాడకుండా,తినడానికి కమ్మగా, ప్రొటీన్ తో పాటు నూట్రిషన్ రిచ్ అయిన పాలకూర చెన్నా ఘీ రైస్ వారానికి ఒక్కసారైనా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. దీనిని కేవలం 10 నిమిషాల్లోనే రెడీచేసుకోవచ్చు. పిల్లలు,పెద్దలు అందరూ దీన్ని ఇష్టపడతారు. పాలకూర ఘీ రైస్ అనేది రుచి, ఆరోగ్యం కలగలిసిన ఒక సంపూర్ణ వంటకం. ఇది పాలకూరలోని పోషకాలను, నెయ్యిలోని శక్తిని అందిస్తుంది. పాలకూర, నెయ్యి రెండూ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని కలపడం వల్ల పోషకాలు మరింత పెరుగుతాయి. పాలకూర చెన్నా ఘీ రైస్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
పాలకూర చెన్నా ఘీ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-పాలకూర
-ఆవాలు
-జీలకర్ర
-మిరియాలు
-పచ్చిమిరపకాయలు
-ఉల్లిపాయలు
-తెల్ల శెనగలు
-పాలకూర
-ఉప్పు
-పసుపు

పాలకూర ఘీ రైస్ తయారీ విధానం
-ముందుగా 1 కప్పు తెల్ల శెనగలను రాత్రంతా నానబెట్టాలి
-తర్వాత 1 కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టాలి.
-ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో తగినంత ఆయిల్ పోసి వేడి చేసి అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని మిరియాలు, కారానికి సరిపడా పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోండి.
-ఉల్లిపాయ చీలికలు రంగు మారుతున్న సమయంలో అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి.
-తర్వాత అందులో 1 కప్పు ముందు రోజు రాత్రి నానబెట్టిన తెల్ల శెనగలు, సన్నగా తరగిన 1 కట్ట పాలకూర, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి పాలకూర పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి.
-తర్వాత అందులో 2 గ్లాసుల నీళ్లు పోసి మరిగించాలి.
-నీళ్లు మరిగిన తర్వాత అందులో నానబెట్టిన 1 గ్లాసు బియ్యం వేసి మూతపెట్టి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత మూతతీస్తే నోరూరించే పాలకూర ఘీ రెస్ రెడీ.
కొన్ని ప్రయోజనాలు
పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది, తద్వారా రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచుకోవడానికి పాలకూర రైస్ చాలా మంచిది. ఈ వంటకం తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలతో నిండి ఉంటుంది. పాలకూరలో విటమిన్ K, కాల్షియం ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. పాలకూరలో విటమిన్ C, విటమిన్ E, బీటా-కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
