Latest Updates
-
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి!
గిన్నెలు గిన్నెలు లాగించే టేస్ట్ ఉండే కొబ్బరి హల్వా...ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
సౌతిండియాలో ముఖ్యంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో చాలా ప్రసిద్ధి చెందిన ఒక సాంప్రదాయ స్వీట్ కొబ్బరి హల్వా. దీనిని కొబ్బరి తురుము, పంచదార, నెయ్యి, యాలకుల పొడి వంటి పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారు. ఈ హల్వా చాలా సులభంగా, తక్కువ సమయంలో ఇంట్లోనే చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఈ హల్వాను చాలా ఇష్టంగా తింటారు. కొబ్బరి హల్వా రుచి అద్భుతంగా ఉండటమే కాకుండా, కొబ్బరిలో ఉండే పోషక విలువలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
కొబ్బరి హల్వా కేవలం రుచిలో మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిలో ఉండే ప్రధాన పదార్థమైన కొబ్బరిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇంట్లోనే 4 రోజుల వరకు కూడా నిల్వ ఉండగలిగేలా కొబ్బరి హల్వాను తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
కొబ్బరి హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు
-కొబ్బరి తురుము
-బెల్లం తురుము
-నెయ్యి
-జీడిపప్పు
-యాలకల పొడి
కొబ్బరి హల్వా తయారీ విధానం
-ముందుగా రెండు కప్పుల కొబ్బరి తురుము(పెద్ద కొబ్బరి కాయ తురుము) సిద్ధం చేసుకోండి.
-తర్వాత మిక్సీ జార్ లో 2 కప్పుల కొబ్బరి తురుము, 1 కప్పు బెల్లం తురుము, కొంచెం నీళ్లు పోసి చాలా మెత్తగా గట్టిగా పేస్ట్ చేసుకోండి. ఎక్కువగా నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవద్దు.
-తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసి అందులో 10-15 జీడిపప్పు పలుకులు వేసి ఎర్రగా వేయించి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న కడాయిలోనే మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి బెల్లం పేస్ట్ వేసి మంటను తగ్గించి బెల్లం కరిగి ముద్ద అయ్యేదాకా ఉడికించుకోండి. దీనికి సుమారు 20 నిమిషాల సమయం పట్టవచ్చు. తీగపాకం వచ్చేదాకా ఉడికించకూడదు..హల్వాలా ముద్దగా ఉండాలి.
-బాగా దగ్గరపడ్డాక అందులో అర టీస్పూన్ యాలకల పొడి, వేయించిన జీడిపప్పు పలుకులు వేసి బాగా కలుపుకోండి.
-దించేముందు 1 టేబుల్ నెయ్యి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. కొబ్బరి హల్వా రెడీ. వేడి వేడిగా తిన్నా లేక చల్లారిన తర్వాత తిన్నా ఎలాగైనా అద్భుతంగా ఉంటుంది. 3-4 వరకు నిల్వ ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












