Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
అమృతాన్ని తలపించే దూద్ దులారి..ఈజీగా ఇలా చేసుకోండి
కడుపులో చాలా చల్లగా,మృదువుగా,చూస్తేనే నోరూరిపోయేలా ఉండే దూద్ దులారి ఎప్పుడైనా తిన్నారా? ఇది పాలతో తయారుచేసే ఒక తీపి వంటకం. బాదం, పిస్తా, కిస్ మిస్ డ్రై ఫ్రూట్స్,పండ్లు దీనికి ప్రత్యేకమైన రుచిని,ఆకర్షణీయతను తీసుకొస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే అమృతంలా ఉంటుంది. సాధారణంగా ఈ డెజర్ట్ ని నార్త్ ఇండియాలో ఎక్కువగా పండుగలు,ప్రత్యేక సందర్భాల్లో తయారుచేస్తుంటారు. అయితే దూద్ దులారిని మీ ఇంట్లో సులభంగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
దూద్ దులారి తయారీకి కావాల్సిన పదార్థాలు
-సేమియా
-పాలు
-ఆయిల్
-ఫ్రెష్ క్రీమ్
-మొక్కజొన్న పిండి
-రోజ్ వాటర్
-వెన్నీలా ఎసెన్స్
-బాదం
-పిస్తా
-కిస్ మిస్
-ఫ్రూట్ కాక్ టెయిల్ లేదా తాజా పండ్లు

దూద్ దులారి తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఓ పెద్ద గిన్నె పెట్టి అందులో ఓ లీటరు బర్రెపాలు పోసి కలుపుతూ మరిగించుకోవాలి.
-పాలు రెండు పొంగులు రాగానే అందులో అరకప్పు సేమియా వేసి సేమియాని మెత్తగా ఉడకనివ్వాలి.
-సేమియా ఉడికిన తర్వాత అందులో ముప్పావు కప్పు నెస్లే మిల్క్ మెయిడ్( Nestle Milkmaid)వేశాక మళ్లీ రెండు పొంగులు వచ్చాక అందులో 1 టీస్పూన్ రోజ్ వాటర్, 1 టీస్పూన్ వెన్నీలా ఎసెన్స్ వేసి బాగా కలపండి.
-తర్వాత ఒక చిన్న బౌల్ లో 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి , పావు కప్పు వేడి పాలు పోసి ఉండలు లేకుండా కలిపాక దీనిని స్టవ్ మీద ఉన్న పాలలో పోస్తూ కలుపుకోవాలి.
-4 నిమిషాలకు పాలు చిక్కబడిన తర్వాత అందులో అర కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలపాలి. చిలికిన చిక్కటి పెరుగు మాదిరి ఉండాలి.
Karivepaku pulao : వాసనకే కడుపు నిండిపోయే కరివేపాకు పులావ్..ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్
-తర్వాత ప్రెజర్ కుక్కర్ ని స్టవ్ మీద నుంచి దించేసి ఓ బౌల్ లో పోసి ఫ్రిడ్జ్ లో కనీసం 2 గంటలు చల్లారనివ్వండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 250ml నీళ్లు పోసి మరిగించాలి. సగం మరిగాక ఇందులో మీకు నచ్చిన ఫ్లేవర్ మార్కెట్ లో దొరికే రెడీమేడ్ జెల్లీ మిక్స్.. అర ప్యాకెట్ వేసి కలపాలి.
-జెల్లీ మిక్స్ కరిగిన తర్వాత దాన్ని ఓ ప్లేట్ లోకి తీసుకొని 2 గంటలు పక్కనపెట్టుకోవాలి. తర్వాత దీన్ని మీకు నచ్చిన షేపులో కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి.
-ఇప్పుడు ఓ చిన్న జల్లెడలో రెడీమేడ్ గా దొరికే 1 కప్పు ఫ్రూట్ కాక్ టెయిల్ లేదా తాజా పండ్ల ముక్కలు(ద్రాక్ష, అరటి, యాపిల్,దానిమ్మ గింజలు) వేసి నీరు దిగాక దీన్ని ఫ్రిడ్జ్ లో ఉంచి దూద్ దులారీ మిశ్రమంలో వేసి కలపాలి.
-తర్వాత అందులో కట్ చేసిన బాదం,పిస్తా పలుకులు వేసి కలపండి. తర్వాత ఇందులో జెల్లీలు, అంగూరీ రసగుల్లాలు 15 వేసి బాగా కలపాలి. అంతే దూద్ దులారీ రెడీ. సర్వ్ చేసే ముందు ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు నానబెట్టిన పాలను దానిమీద చల్లితే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications